సిని పరిశ్రమలో ఓ నానుడి వుంది. నటుడు వేరు స్టార్ వేరు.. ముఖ్యంగా ఇది తెలుగు సినమా ఇండస్ట్రీపై ఎక్కువుగా వినిపిస్తుంటుంది. అసలు నటుడంటే పాత్రలో పరకాయ ప్రవేశం చేసి పాత్రకే వన్నే తెచ్చేవారిని అర్థం… పాత్రకి అలంకారణ చేసి పాత్రకంటే పాత్ర తీరుకే ప్రాముఖ్యత ఇచ్చే వాళ్ళని స్టార్స్ అంటారు. వీరిద్దరూ ఒకేఒరలో వుండలేరు.. ఒకవేళ వున్నా కూడా వారికి వున్న ఫ్యాన్ బేస్‌ని దృష్టిలో పెట్టుకుని దర్శక రచయితలు కథలు రాస్తారు.
ఒక్కోసారి స్టార్ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చినా అవి ఫెయిల్ అయిన సందర్బాలున్నాయి.. ఒక హీరో ఏ ఇమేజ్ చట్రంలో ఇరుక్కుంటారో చివరివరకూ అదే ఇమేజ్ ని కొనసాగించాలి.. మెగాస్టార్ చిరంజీవి మెదటిలో చేసిన చిత్రాల్లో ఆయన నటుడుగా ప్రేక్షకుల మన్ననలు పొందారు.
కాని కమర్షియల్ ఇమేజ్ వచ్చాక.. అంతలా తనలోని నటుడ్ని ఆవిష్కరించుకునే అవకాశం రాలేదు.. ఇది కేవలం చిరంజీవికే కాదు రజనీకాంత్ లాంటి వాళ్లకు కూడా ఇదే సమస్య.. కాని ఇప్పుడు ప్రేక్షకుడు మారాడు.. స్టార్స్ నే కాదు స్టార్ లోని నటుడ్ని కూడా చూడాలనుకుంటున్నాడు. చూడటమే కాదు వారి నటనకి ఘనస్వాగతం పలుకుతున్నారు.
2017లో వచ్చిన రాజాది గ్రేట్ చిత్రంలో రవితేజ మాస్ ఇమేజ్ నుండి అంధుడిగా నటించి కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. 2018లో సమ్మర్ లో మెదటి చిత్రంగా విడుదలయ్యి తన ఇమేజ్ ని పక్కన పెట్టి చెవిటి వాడిగా అదే సౌండ్ ఇంజనీర్ గా మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ అత్యద్బుతంగా నటించారు. నటించడమే కాదు భాక్సాఫీస్ ని రీ-సౌండ్ వచ్చేలా చేశాడు. రంగస్థలం చూసి వచ్చిన ప్రేక్షకుడికి మరోక్క నటుడు గుర్తుకురాడంటే అతిశయెక్తికాదు.
అలానే సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రంలో విదేశాల్లో చదువుకున్న యువకుడు ఆంద్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయితే ఎలా వుంటాది అనేది కళ్లకి కట్టినట్టుగా నటించి చూపించాడు మహేష్.. సీఎం అంటే ఓ పంచే లేదా తెల్లని వస్త్రాలు వేసుకుని కాదు ఫార్మల్ డ్రస్ వేసుకుని కూడా చక్కగా పరిపాలించవచ్చని చూపించాడు. మహేష్ బాబు నటన అతని కెరీర్ లోనే బెస్ట్ అయింది.
ఇదే తరహాలో సమ్మర్ లోనే వచ్చింది అల్లుఅర్జున్ హీరోగా చేసిన నా పేరు సూర్య కూడా. సైన్యంలోకి వెళ్లి, బోర్డర్ లో వుండి దేశానికి కాపలా కాయాలనే లక్ష్యం వున్న పాత్రలో అల్లుఅర్జున్ నటించాడు. సినిమాకు మిక్స్ డ్ టాక్ వున్నా, బన్నీ పాత్రకు, పెర్ ఫార్మెన్స్ కు క్రిటిక్స్ నుంచి ఏకాభిప్రాయం వ్యక్తం అయింది.
ఇక అప్ కమింగ్ హీరోయిన్ కీర్తిసురేష్ అలనాటి మహానటి సావిత్రి పాత్రలో నటించి మెప్పించబోతోంది. ఈ సినిమా 9న విడదుల కాబోతోంది. మొత్తంమీద ఈ సమ్మర్ అంతా నటనకు, ప్రతిభా ప్రదర్శనకు అవకాశం వున్న సినిమాలే రావడం విశేషం.