టాప్ హీరోలకు కరోనా?

టాలీవుడ్ లో చాలా మందికి కరోనా వచ్చింది..తగ్గింది. అదేమీ వింతా కాదు, విడ్డూరమూ కాదు. ఈ మధ్యకాలంలో కరోనా రాని వాళ్ల గురించి చెప్పుకోవాలి కానీ వచ్చిన వాళ్లను గురించి కాదు. అలా వుంది…

టాలీవుడ్ లో చాలా మందికి కరోనా వచ్చింది..తగ్గింది. అదేమీ వింతా కాదు, విడ్డూరమూ కాదు. ఈ మధ్యకాలంలో కరోనా రాని వాళ్ల గురించి చెప్పుకోవాలి కానీ వచ్చిన వాళ్లను గురించి కాదు. అలా వుంది ట్రెండ్. అయితే సెలబ్రిటీల వ్యవహారం వేరు.

వాళ్లకు మంచి జరిగినా వార్తే, మరేం జరిగినా వార్తే. ఇంతకీ విషయం ఏమిటంటే టాలీవుడ్ లో ఓ టాప్ హీరోకి కొన్నాళ్ల కిందట కరోనా సోకినట్లు వార్తలు గుప్పుమన్నాయి.

సాధారణంగా ఈ హీరో కరోనా విషయంలో చాలా జాగ్రత్తగా వున్నారు. బై మిస్టేక్ కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎవర్నన్నా కలవాలన్నా ఇంట్లో షీల్డ్ పెట్టుకుని మరీ కలిసారు.  కానీ అనుకోకుండా  ఓ యాడ్ షూటింగ్ కు వెళ్లారని తెలుస్తోంది.

దాంతో కరోనా సోకినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. దాంతో తను చేయబోయే తరువాత సినిమాకు సంబంధించిన షూటింగ్ ను క్యాన్సిల్ చేసి, విశ్రాంతి తీసుకున్నట్లు, ఇప్పుడు రికవరీ అయినట్లు తెలుస్తోంది.

ఇదిలా వుంటే ప్రస్తుతం కరోనా కారణంగా సినిమా షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి ఇంట్లోనే  వుంటున్నారు  మరో టాప్ హీరో. మరీ భయంకరమైన జాగ్రత్తలు ఏమీ తీసుకోవడం లేదు కానీ వీలయినంత కంట్రోల్ గానే వుంటున్నారు. ఏదో పుస్తకాలు చదువుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఆయనకు కూడా ఆ మధ్య కరోనా వచ్చి తగ్గినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు కొండాపూర్ లోని ఓ ప్రయివేట్ లాబ్ లో టెస్ట్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఆయన పనులు అన్నీ దగ్గర వుండి చూసే, ఆయన అసిస్టెంట్ లు ఇద్దరికి కూడా కరోనా వచ్చి తగ్గినట్లు తెలుస్తోంది.