ఒకటీ రెండు తెలుగు సినిమాల్లో నటించి, ఈ మధ్యనే తన హాట్ కామెంట్స్ తో బాలీవుడ్ లో దుమారం రేపిన నటి పాయల్ ఘోష్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది. ఎన్డీయే భాగస్వామ్యపక్షం అయిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఏ)లో ఆమె చేరింది.
కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే ఈ పార్టీ చీఫ్. అథవాలే ఆధ్వర్యంలో ఆమె ఈ పార్టీలో చేరారు.విశేషం ఏమిటంటే పార్టీలో చేరగానే ఆమెకు పదవి కూడా దక్కింది. ఆ పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా పాయల్ ఘోష్ నియమితం అయ్యారు.
ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో పాయల్ ఘోష్ దుమారం రేపింది. ఆమె ఆరోపణల ఆధారంగా ఆ దర్శకుడిపై కేసు నమోదు అయ్యింది. తన ఆరోపణలను నిరూపించడానికి తన వద్ద ఎలాంటి ఆధారాలూ లేవని ముందే ఈమె క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత కశ్యప్ ను పిలిపించి పోలీసులు విచారించారు.
ఎనిమిది గంటల పాటు ఆయనను పోలీసులు గ్రిల్ చేసినా, తను ఆమెపై అనుచితంగా ప్రవర్తించలేదని ఆ దర్శకుడు స్పష్టం చేశాడట. అనురాగ్ కశ్యప్ ను ఎందుకు అరెస్టు చేయలేదంటూ పాయల్ ఘోష్ ఆ తర్వాత ప్రశ్నించింది.
ఆధారాలు లేవని ఆమె స్వయంగా చెబుతూ, అరెస్టు ఎందుకు చేయలేదంటూ ప్రశ్నించడం గమనార్హం. పాయల్ ఘోష్ కు అనుకూలంగా నటి కంగనా రనౌత్ స్పందించింది. ఇటీవలే పాయల్ పిచ్చి ట్వీట్లు చేసింది.
బాలీవుడ్ లో వ్యభిచారులను పక్కన పడుకోపెట్టుకునేంత డబ్బు తన తండ్రి వద్ద ఉందంటూ ట్వీట్ చేసింది పాయల్. ఆయన మరీ ధనికుడు కాకపోయినా ఆ మాత్రం డబ్బుదంటూ ట్వీట్ చేసింది. ఆ వెంటనే ఆ ట్వీట్లను డిలీట్ చేసింది. ఇప్పుడు ఇలా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది.