ఎవరిసత్తా, ఎంతకాలం, ఎలా వుంటుంది? కొత్త నీరు రావాల్సిందే. పాత నీరు పక్కకు తప్పుకోవాల్సిందే. రచయితగా దర్శకుడు త్రివిక్రమ్ చార్మ్ రాను రాను తగ్గుతోందనిపిస్తోంది.
ఎందుకంటే చిన్న బిట్ అయినా త్రివిక్రమ్-త్రివిక్రమ్ నే అన్నట్లు వుండేది నిన్న మొన్నటి వరకు. మహేష్ తో అభిబస్ యాడ్ లాంటి చిన్నది చేసినపుడు కూడా ఆ చార్మ్ కనిపించింది. ‘ఇప్పటికే తగ్గానండి’ అని అంటే, ‘ఇంకా తగ్గొచ్చండీ’ అనే పంచ్ అక్కడ త్రివిక్రమ్ మార్క్ ను క్లియర్ గా చూపించింది.
కానీ లేటేస్ట్ గా వచ్చిన ఐపీఎల్ తెలుగు యాడ్ మాత్రం త్రివిక్రమ్ మార్క్ లో లేదు. ఎన్టీఆర్ ను, అరడజను మంది యంగ్ కుర్రాళ్లను అక్కడపెట్టి, ఓ రూమ్ షేర్ చేసుకునే బ్యాచులర్ బ్యాచ్ గా చూపిస్తూ, చెప్పించిన ప్రాస డైలాగు ఏమాత్రం కొత్తగానూలేదు. చమక్కుతోనూలేదు.
డి..డి..డి.. అంటూ చెప్పిన డైలాగు పరమ రొటీన్ గా వుందనే అనిపిస్తోంది. బిగ్ బాస్ ప్రోమోల్లో తళుక్కున మెరిసిన ఎన్టీఆర్ ఈ ఐపీఎల్ ప్రోమోలో కూడా ఏ జస్ట్ డైలాగ్ చెప్పడం మినహా, మరేమీ స్పెషల్ అనిపించలేదు.
మొత్తంమీద చూసుకుంటే త్రివిక్రమ్ చరిష్మా తగ్గినట్లే వుంది. ఇదే ఒకటే ప్రోమోనా? ఇంకా వస్తాయా? అవెలా వుంటాయి అన్నదాన్ని బట్టి త్రివిక్రమ్ గురించి అంచనా వేసుకోవచ్చు ఇదిలావుంటే ఎన్టీఆర్ కొత్తగా మారిపోయాడు అన్నది ఇటీవల బాగా ప్రచారం జరిగింది. అయితే మరీ కొత్తగా ఏమీ మారిపోలేదు. హెయిర్ స్టయిల్ కాస్త కొత్తగా వుంది. ఫిజిక్ మీడియమ్ గా వుంది. టోటల్ గా బాగున్నాడు అనుకునేలా వున్నాడు.