Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

త్రివిక్రమ్ సినిమా 'ఇంటిగుట్టు' ఇదేనా?

త్రివిక్రమ్ సినిమా 'ఇంటిగుట్టు' ఇదేనా?

టాప్ దర్శకులు అందరికీ ఒకటే సమస్య. కథలు. పెద్ద డైరక్టర్లు అయిన కొద్దీ కథలు ఆలోచించే సమయం వుండదు. సరైన స్క్రిప్ట్ దొరికితే సీనియర్ లేదా పెద్ద డైరక్టర్లు అంతా హిట్ కొట్టే కెపాసిటీ వున్నవారే. కథలు అల్లడం కోసం టైమ్ కేటాయించలేరు. హీరోలు, నిర్మాతలు రెడీగా వుంటారు. అర్జెంట్ గా కథ కావాలి. అందుకే 'ఎక్కడో అక్కడ నుంచి ఇన్ స్పయిర్' అయి లైన్ మాత్రం చెప్పేసి ఓకె చేయించేసుకుంటారు. అక్కడి నుంచి వంటకాలు ఆరంభిస్తారు. 

ఈ తరహా వైఖరికి ఏ ఒక్కరూ మినహాయింపు కారు. వార పత్రికలు, మాస పత్రికల్లో వచ్చే నవలల్లోని పాయింట్లు కొట్టేసేవారు కొందరు. హాలీవుడ్, కొరియన్ సినిమాల్లోంచి లేపేసేవారు మరి కొందరు. త్రివిక్రమ్ ఆ మధ్య అ..ఆ సినిమాతో కొత్త ఫార్ములా కనిపెట్టారు. పాత సినిమాలను కొత్తగా తీస్తే ఎలా వుంటుందీ అన్నది ఆ ఫార్ములా. మీనా సినిమాను అ..ఆ సినిమాగా మార్చి హిట్ కొట్టారు. 

ఇప్పుడు మళ్లీ అలాంటి ప్రయత్నమే చేస్తున్నారని వాట్సప్ పోస్టులు గుసగుసలు పోతున్నాయి. 'ఇంటిగుట్టు' అనే ఎన్టీఆర్ సినిమా పాయింట్ తో త్రివిక్రమ్ తన తాజా సినిమా 'అల వైకుంఠపురములో' సినిమాకు కథ రాసుకున్నారన్నది వాట్సప్ పోస్టుల సారాశం.

అల వైకుంఠపురములో సినిమాలో బన్నీ, సుశాంత్ లు తమ తమ తల్లుల దగ్గర నుంచి అటు ఇటు మారిపోతారు అన్నది కీలకమైన లైన్ గా వినిపిస్తోంది. ఇంటిగుట్టు సినిమాలో కూడా అదే వ్యవహారం. మరి అందుకే అలా వినిపిస్తోందో? లేదా ఆ లైన్ నే త్రివిక్రమ్ రీమిక్స్ చేస్తున్నారో, సినిమా విడుదలయితే కానీ తెలియదు.

మొత్తం మీద సినిమా రంగంలో ప్రస్తుతం కథలు, కథకుల కొరత అయితే విపరీతంగా వుంది. అందుకే ఈ కాపీలు, ఇన్సిపిరేషన్లు, రీమిక్స్ లూనూ.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?