ఇది నిజంగా ఓ షాకింగ్ గ్యాసిప్. అంటే నిజమో కాదో తెలియదు. అందుకే గ్యాసిప్ అన్నది. ఇంతకీ విషయం ఏమిటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు బ్రేకప్ అన్నది లేకుండా కొనసాగుతున్న మిత్రుడు ఒక్కరే ఒక్కరు.. దర్శకుడు త్రివిక్రమ్. ఆ ఇద్దరి బాండింగ్ అలాంటిది.
పవన్ కళ్యాణ్ కాస్త విరామం తరువాత మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. ఆ రావడం అంతా త్రివిక్రమ్ కను సన్నలలోనే జరిగింది. పవన్ కు సూటయ్యేలా, ఆయన రాజకీయ కార్యకలాపాలకు అడ్డం పడకుండా వుండేలా, తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తయ్యేలా సినిమాలు సెట్ చేసారు. అంతే కాదు ఆ సినిమాల మేకింగ్, క్వాలిటీ చెక్ ఇవన్నీ తెరవెనుక వుండి పర్యవేక్షించారు.
వకీల్ సాబ్, భీమ్లానాయక్, బ్రో, ఓజి సినిమాలు నాలుగు త్రివిక్రమ్ సెట్ చేసినవే. ఉస్తాద్ సినిమా ముందు నుంచి ప్లానింగ్ లో వుంది. హరిహర వీరమల్లు చాలా కాలం కిందటి నుంచి డ్యూ వుంది. త్రివిక్రమ్ సెట్ చేసిన సినిమాలు అన్నీ ముఫై నుంచి నలభై రోజుల కాల్ షీట్లతో పూర్తయ్యే సినిమాలు. కానీ రెమ్యూనిరేషన్ మాత్రం మంచిగా సెట్ చేసారని టాక్ వుంది. భీమ్లా నాయక్, బ్రో సినిమాలకు తెరవెనుక అన్నీ తానై వ్యవహరించారు త్రివిక్రమ్. ఓజి స్క్రిప్ట్ అంతా ఆయన కనుసన్నలలోనే జరిగింది.
అందువల్ల పవన్ కళ్యాణ్ ఎంత భారీ బహుమతి ఇచ్చినా తక్కువే అవుతుంది. స్నేహానికి వెల కట్టలేము కూడా. అయితే అలా అని పవన్ వదిలేసే రకం కాదు. అందుకే త్రివిక్రమ్ కు భారీ బహుమతి అంటే సుమారు ఆరు కోట్ల విలువైనది అందించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ బహమతి బంజారాహిల్స్ లో ఓ భవంతి రూపంలో ఇచ్చారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
కానీ ఇప్పటికీ ఇది గ్యాసిప్ నే. ఎందుకంటే ఎక్కడ కొన్నారు. కొన్నారా లేదా.. కొంటే త్రివిక్రమ్ కొనుక్కున్నారా? పవన్ బహుమతినా అన్నది తెలియాలి అంటే కాస్త టైమ్ పడుతుందేమో?