తివిక్రమ్..ఎంతమందితో?

మహేష్ బాబు-త్రివిక్రమ్, అఖిల్-త్రివిక్రమ్ ఇలా కాంబినేషన్లు వినిపిస్తూనే వున్నాయి. అయితే ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల-మహేష్ బాబు కాంబినేషన్ సెట్ కావడం, త్రివిక్రమ్ టాప్ హీరోలతోనే చేసే ఆలోచనలో వున్నాడు కాబట్టి అఖిల్ సినిమా, ఇలా…

మహేష్ బాబు-త్రివిక్రమ్, అఖిల్-త్రివిక్రమ్ ఇలా కాంబినేషన్లు వినిపిస్తూనే వున్నాయి. అయితే ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల-మహేష్ బాబు కాంబినేషన్ సెట్ కావడం, త్రివిక్రమ్ టాప్ హీరోలతోనే చేసే ఆలోచనలో వున్నాడు కాబట్టి అఖిల్ సినిమా, ఇలా రెండూ ప్రస్తుతానికి వెనక్కు వెళ్లినట్లే. 

ఇక మిగిలింది ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ అండ్ రామ్ చరణ్. పవన్ కూడా గబ్బర్ సింగ్ 2 వ్యవహారంలో వున్నారు. ఎన్టీఆర్ సుకుమార్ సినిమా ఓకె అన్నారు. ప్రభాస్ హోమ్ ప్రొడక్షన్ కు ఓకె అన్నారు. అందుకే ఇప్పుడు రామ్ చరణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ సెట్ చేసే ప్రయత్నాలు ప్రారంభమైనట్లు వినికిడి. అయితే ఒకటి రెండు సమస్యలున్నాయి. 

త్రివిక్రమ్ సినిమాకు కామెడీని కాస్తయినా పండించగల హీరో కావాలి. పైగా ఆయన సబ్జెక్ట్ లో వేరేవాళ్లు వేలు పెడితే అంగీకరించరు. మరి రామ్ చరణ్ సినిమా అంటే మెగాస్టార్ జోక్యం టైటిళ్ల నుంచి శుభం కార్డు వరకు వుంటుంది. పైగా రామ్ చరణ్తో కామెడీ పండించడం అంటే కొంచెం కష్టపడాలి. అందువల్ల త్రివిక్రమ్ –చరణ్ కాంబినేషన్ ఎంతవకరు సెట్ అవుతుందన్నది అనుమానం.