అయిపోయింది. మరో మంచి సినిమా ఓటిటి కి వెళ్లిపోయింది. శివనిర్వాణ-నాని కాంబినేషన్ లో సాహు గారపాటి నిర్మించిన టక్ జగదీష్ సినిమాను మొత్తానికి ఓటిటికి ఇచ్చేసారు.
థియేటర్లు తెరుస్తారని, రేట్లు మారుతాయని, అంతా నార్మల్ అవుతందనే ఆశలు నానాటికీ అడుగు అంటుతుండడంతో ఓటిటి దారిలోకి వెళ్లకతప్పలేదు. ఈ సినిమాను థియేటర్లలోకే తేవాలని ఇన్నాళ్లు ఓపిగ్గా వేచి చూసారు.
రెండు కరోనా సీజన్లకు వడ్డీలు కూడా కట్టుకున్నారు. అయినా ఫలితం లేకపోయింది. కరోనా ఫస్ట్ సీజన్ లో నాని నటించిన వి సినిమాను ఓటిటికే ఇచ్చారు. ఆ వెంటనే మరో సినిమాను కూడా ఓటిటికి ఇవ్వడం ఇష్టం లేక హీరో నాని ఇన్నాళ్లు ఆపుకుంటూ వచ్చారు.
కానీ రాను రాను వడ్డీలు తడిసి మోపెడు అవుతున్నాయి. అందుకే ఇక నాని కూడా నిర్మాతలను పెద్దగా అభ్యంతరం చెప్పలేకపోయారు. ఈ సినిమా తరువాత దర్శకుడు శివనిర్వాణ మైత్రీ మూవీస్ సినిమా మీదకు వెళ్తారు.