టాలీవుడ్ లో వున్న భిన్నమైన నిర్మాతల్లో ఒకరు సాయి కొర్రపాటి. కేవలం వ్యాపారం కాకుండా కాస్త భిన్నంగా ఆలోచించడం ఆయనకే చెల్లు. పైగా ఆయన సావాసగాళ్లు కూడా అలాంటివాళ్లే. రాజమౌళి, కీరవాణి అండ్ కో. 2014లో లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ తో పాటు ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్యా లాంటి వైవిధ్యమైన చిన్న సినిమాలు తీసి, హిట్ చేసుకున్నారు.
ఇప్పుడు ఆయన తుంగభద్ర అనే రాజకీయ నేపథ్యపు సినిమా నిర్మిస్తున్నారు. మిర్చిలో కీలక పాత్ర ధరించిన సత్యరాజ్ కీలక పాత్ర ధారి. ఇప్పుడు ఈ సినిమా అడియో ఫంక్షన్ కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారని వినికిడి. సాధారణంగా అడియో ఫంక్షన్లంటే సోత్కర్షలు, పిచ్చి పిచ్చి డ్యాన్సులు కామన్. కానీ అలా కాకుండా కాస్త మన తెలుగు సాంప్రదాయం, సంగీతం వినిపించాలని అనుకుంటున్నారట.
ఆయా వాయిద్యాల్లో నిష్ణాతులైన వారిని తెచి, వారి ప్రతిభ ప్రదర్శింప చేసి, వారిని సత్కరించాలన్నది సాయి కొర్రపాటి ఆలోచనగా తెలుస్తోంది. అయితే ఇది ఇంకా మొగ్గదశలోనే వుంది. ఎవర్ని పిలవాలి..ఎలా పిలవాలి.అదే విధంగా ఈ సభను ఓపెన్ గా నిర్వహించాలా? కేవలం పాతిక ముఫై మంది లిమిటెట్ గ్యాదరింగ్ ను పిలిచి, టీవీ చానెళ్లలో లైవ్ ఇవ్వాలా అన్న ఆలోచనలు ఇంకా సాగుతున్నాయని వినికిడి.
దిక్కులు చూడకు రామయ్యా సినిమాకు కూడా గురుశిష్యులు అనే కాన్సెప్ట్ తో వైవిధ్యంగా అడియో ఫంక్షన్ నిర్వహించారు. అన్నట్లు ఇలా ఫంక్షన్లు నిర్వహించడానికి సాయి ఓ సంస్థ కూడా ఏర్పాటు చేసారు. అయితే ప్రస్తుతానికి ఆ సంస్థ సాయి అండ్ కో సినిమాల ఫంక్షన్లు మాత్రమే నిర్వహిస్తోంది.