న్యూస్ చానెళ్లు ఇప్పుడు సినిమా ఫంక్షన్లు ప్రసారం చేయడమే గ్రేట్ గా ఫీల్ అవుతున్నాయి. అందుకోసం పోటీ పడుతున్నాయి. ఈ పోటీలో ఇటీవల టీవీ 5 తెగ కిందా మీదా పడుతోంది. అఖిల్ సినిమా అడియో ఫంక్షన్ ను ఆ చానెల్ నే ప్రసారం చేసింది.
అయితే ఈ ప్రసారానికి అంత మైలేజీ రాలేదని హీరో నితిన్ ఫీల్ అయ్యాడని టాలీవుడ్ గుసగుసల సారాంశం. అప్పట్లో రేటింగ్ చాలా తక్కువ వచ్చిందని వినికిడి. దీనివల్ల సినిమాకు రావాల్సిన రెస్పాన్స్ రాలేదని నితిన్ ఫీలయ్యాడంటున్నారు. అందుకే ఈ సారి విశాఖలో ఎనిమిదిన జరిగే ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ ను టీవీ 9 కు ఇచ్చారంటున్నారు.
అయితే ఇక్కడే వేరే వెర్షన్ కూడా వినిపిస్తోంది. టీవీ 5 పాతిక లక్షలు ఎదురు ఇచ్చింది కాబట్టి వాళ్లకు ఇచ్చారని, నిజానికి ఎల్ ఎల్ పి ప్రకారం టీవీ 9, ఎన్ టీవీ కి ఇవ్వాలని, అప్పడే ఈ చానెళ్ల వాళ్లు గుస్సాయించారని అంటున్నారు. ఇది సినిమా ప్రమోషన్ పై నెగిటివ్ ఫ్రభావం చూపిస్తుంది కాబట్టి, ఒక్కో ఫంక్షన్ ఒక్కో చానెల్ కు అవకాశం ఇస్తే, అందరినీ వాడుకోవచ్చనీ అఖిల్ నిర్మాతలు ప్లాన్ చేసారనీ అంటున్నారు.
యూజువల్ గా నాగ్ ప్రమేయం వున్న సినిమాల ఫంక్షన్లకు మా టీవీ యూనిట్ వెళ్లి షూట్ చేస్తుంది. అయితే టీవీ 5 ఎక్స్ క్లూజివ్ కావడంతో వారికే వదిలేసారు. అది కూడా ప్రభావం చూపిందా అన్న గుసగుసలూ వినిపిస్తున్నాయి. అందుకే ఈసారి విశాఖ ఫంక్షన్ ను మా టీవీ యూనిట్ నే చిత్రీకరిస్తుందట. దానికి ప్రతిగా మా మ్యూజిక్ లో లైవ్ ఇస్తరనుకుంటున్నారు.
మొత్తానికి న్యూస్ చానెళ్లకు జనాల సమస్యల కన్నా, సినిమా ఫంక్షన్లే ముద్దుగా వున్నట్లు కనిపిస్తోంది.