కరోనా లాక్ డౌన్ వల్ల దారుణంగా ఎఫెక్ట్ అయిన సినిమాల్లో ఉప్పెన ఒకటి. జస్ట్ ఇంకొద్ది రోజుల్లో విడుదల అనగా లాక్ డౌన్ వచ్చిపడింది. లేటెస్ట్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ తొలి ఎంట్రీ కావడంతో, వెయిట్ చేద్దాం అని ఓటిటికి దూరంగా వుంటూ వచ్చారు. కానీ తరువాత తరువాత పరిస్థితులు ఇఫ్పటిలో చక్కబడేలా లేకపోవడంతో ఓటిటికి ట్రయ్ చేసినట్లు తెలుస్తోంది.
కానీ సమస్య ఏమిటంటే, మనకి మెగా హీరో కానీ ఓటిటి కి కాదు కదా? కొత్త హీరో, కొత్త డైరక్టర్ కావడంతో పెద్దగా గొప్ప ఆఫర్ రాలేదని తెలుస్తోంది. 13 కోట్లకు కాస్త అటు ఇటుగా ఆఫర్ వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. ఇది ఏమాత్రం కిట్టుబాటు కాదు నిర్మాతలు అయిన మైత్రీ మూవీస్ కు. ఎందుకంటే ఈ సినిమాకు దాదాపు పాతిక కోట్లకు ఫైగా ఖర్చయింది. కరోనా వడ్తీలు అన్నీ కలుపుకుంటే ముఫై అయిపోయినట్లు బోగట్టా.
శాటిలైట్, హిందీ డబ్బింగ్ కలిపినా, డిజిటల్ హక్కులు 13 కోట్లు వచ్చినా టార్గెట్ కు చాలా దూరంగా వుండిపోతుంది. అందుకే ఇక ఉప్పెనను థియేటర్ విడుదలకే వుంచేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆరంభంలో లేటెస్ట్ మెగా హీరో తొలి సినిమా అనే సెంటిమెంట్ తో వెయిట్ చేసారు. తరువాత ఓటిటికి ఇద్దామన్నా, రేటు సమస్య అయింది. ఇక ఇప్పుడు థియేటర్ కే ఉప్పెన రెడీగా వుంది.