విశాఖలో ఉప్పెన సినిమా చూసింది ఓ సినిమా టీమ్. సినిమాలో కీలకమైన వారు ఆ బ్యాచ్ లో వున్నారు. అయితే సినిమా జనాల సంగతి తెలిసిందే.
ఎదురుగా శభాష్ అంటారు. వెనుకాల పెదవి విరుస్తారు. కామెంట్లు చేస్తారు. విషయం ఏమిటంటే ఈ టీమ్ కూడా థియేటర్ లో సినిమా చూసినంత సేపూ విపరీతంగా కామెంట్లు పాస్ చేస్తూ, పడి పడి నవ్వుకున్నట్లు బోగట్టా.
వారిలో వారు గుసగుసలు గా కామెంట్లు చేసుకుంటే అదే తరహా. కానీ కాస్త గట్టిగా వినిపించేలాగే చేయడంతో ముందు, వెనుక, పక్కన వున్న కామన్ ప్రేక్షకులకు బాగానే వినపడ్డాయి. దాంతో ఆ సంగతి అలా అలా బయటకు పాకుతోంది.
ఆ సీన్ చూసి ఆడు ఆలా అన్నాడ్రా, ఈ సీన్ చూసి ఈడు ఇలా అన్నాడ్రా అంటూ విశాఖ ప్రేక్షకుల్లో కామెంట్లు వినిపిస్తున్నాయట. వాళ్లకు కొత్త ఏమో కానీ సినిమా జనాలకు, సినిమా జనాల సంగతి అలవాటే, తెలిసిన సంగతే.