cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

ఉక్కు పై జగన్ నోరు విప్పాలి

ఉక్కు పై జగన్ నోరు విప్పాలి

నలుగురు కలిసి మేక అంటే మేకే..కుక్క అంటే కుక్కే...తెలుగుదేశం పార్టీది అదే వైఖరి. అలా నలుగురు కలిసి అరవడం కోసం ఆ ఫార్టీ అను'కుల' మీడియా వుండనే వుంది. వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విశాఖలో తెలుగుదేశం అను'కుల'జనాలకు ఊపిరి ఆడడం లేదు. 

చిరకాలంగా ఉత్తరాంధ్ర వాసుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని, తమ పార్టీని చేతిలో వుంచుకుని, రాజకీయంగా పదవులు సంపాదిస్తూ, అనుభవివస్తూ, వాటి ఆలంబనతో వ్యాపారాలు, దందాలు చేసుకుంటూ మూడు జిల్లాల్లో పాతుకుపోయారు. విశాఖను అన్ని రంగాల్లో తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. అలాంటిది వైకాపా అధికారంలోకి వచ్చాక ఊపిరి ఆడడం లేదు.

ఇలాంటి టైమ్ లో ఉక్కు విజాతీయకరణ అన్నది అందివచ్చిన అవకాశం అయింది. విశాఖ ఉక్కును అమ్మేయడం అన్న ప్రాసెస్ కేంద్రం ప్రారంభించింది తెలుగుదేశం హయాంలో.  నిన్నా మొన్నా ప్రారంభించలేదు అనేక సమావేశాలు నిర్వహించాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవ్వరూరాలేదు అని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ నే స్వయంగా ప్రకటించారు. 

నిజానికి విశాఖ ఉక్కు అనేది కేంద్ర ప్రభుత్వ కార్పోరేషన్ ఆధీనంలో వున్న సంస్థ. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ అనేది రాష్ట్ర ప్రభుత్వ సంస్థ కాదు. ఈ సంస్ధకు లాభాలు వస్తే డివివెండ్ లు పట్టకెళ్లి ఇచ్చేది కేంద్రానికి కానీ రాష్ట్రానికి కాదు. ఉక్కు కర్మాగారానికి సిఎమ్డీ ని నియమించేది కేంద్రం తప్ప రాష్ట్రం కాదు. రాష్ట్ర ప్రమేయమే వుండదు. 

ఇలాంటి నేపథ్యంలో కేంద్రం అమ్మేస్తాను అంటే రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగింది కేవలం నిరసన వ్యక్తం చేయడం, మహా అయితే అసెంబ్లీ లో తీర్మానం చేయడం. ఇంకాకావాలంటే అఖిలపక్షాన్ని కేంద్రం దగ్గరకు తీసుకెళ్లడం. లేదూ అంటే రాష్ట్రమే పోరాటాన్ని ఉద్యమాన్ని ప్రోత్సహించి, విశాఖలో నానా అలజడి చేయించడం. 

ఇప్పటి పరిస్థితుల్లో ఈ లాస్ట్ ఆప్షన్ కు ప్రభుత్వానికి అవకాశం లేదు. కానీ అదే టైమ్ లో ప్రతిపక్ష తెలుగుదేశానికి క్లియర్ ఆప్షన్లు వున్నాయి. కేంద్రం మీద మరోసారి పోరాటం సాగించవచ్చు. గత ఎన్నికల ముందు మోడీ మీద చంద్రబాబు తొలిసారి ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఆ రేంజ్ లో మరోసారి ధ్వజమెత్త వచ్చు.

కానీ చిత్రంగా చంద్రబాబు లేదా లోకేష్ నోటి వెంట కేంద్రం, లేదా మోడీ అనే పదాలు పొరపాటున వినిపించడం లేదు. విశాఖను జగన్ అమ్మేస్తున్నారు. విశాఖ మీద జగన్ కు కోపం, విశాఖను విజయసాయి అమ్మేస్తున్నారు అనే ప్రచారానికి తెరతీసారు. విశాఖను రాజధాని చేసి జగన్ సంపాదించిన క్రెడిట్ ను మొత్తం ఈ ప్రచారంతో తుడిచిపెట్టేయాలని చంధ్రబాబు అండ్ కో డిసైడ్ అయిపోయారు. అదే కార్యక్రమం కొనసాగిస్తున్నారు.

కానీ ఇలాంటి టైమ్ లో ఆ తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టే పని వైకాపా సమర్థవంతంగా చేయలేకపోతోంది. జగన్ పెదవి విప్పి మాట్లాడరు. అవసరం అయినపుడయినా మీడియా ముందుక వచ్చి ఈ తప్పుడు ప్రచారాన్ని తూర్పారపట్టరు. ఇక కడుపు నిండిపోయిన వైకాపా నాయకులు అనేక మంది ప్రస్తుతం పదవుల భుక్తాయాసంతో నిద్రావస్థలో వున్నారు. ఒకప్పుడు మీడియా ముందు మైకులు చించుకుని అరిచిన నాయకులు అంతా పదవులు సంపాదించి సైలంట్ అయిపోయారు.

ఎంతసేపు మాట్లాడినా విజయసాయి, మహా అయితే మరో ఒకరిద్దరు. అంతే తప్ప వైకాపా వాయిస్ వినిపించే జనాలు లేరు. గతంలో విజయమ్మ పోటీ చేసినపుడు కడప రౌడీలు వస్తారు అనే తప్పుడు ప్రచారం సాగించి, గెలిచిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మేయర్ ఎన్నిక సందర్భంగా మళ్లీ ఉక్కును జగన్ నే అమ్మేస్తున్నారనే తప్పుడు ప్రచారానికి తెరతీసారు.  విజయసాయి పాదయాత్ర అంటూ ఓ ప్రయత్నం ప్రారంభించారు. కానీ అది సరిపోదు. జగన్ స్వయంగా నోరు విప్పి నిజాలు గట్టిగా చెబితే తప్ప జనంలో తెలుగుదేశం సాగిస్తున్న ప్రచారానికి సరైన కౌంటర్ పడదు.

జగన్ ఈ బుధవారం విశాఖ వస్తున్నారు. ఈ సందర్భంగా లోకల్ మీడియాతో ఇంట్రాక్ట్ అయితే అదో మంచి అవకాశం అవుతుంది. కానీ ఆ దిశగా ప్రయత్నాలు కానీ ఆలోచనలు కానీ జరుగుతున్నట్లు లేదు. వైకాపా నేతలు, అధినేతలు ఉక్కు పై సాగుతున్న ప్రచారం విషయంలో అనుసరిస్తున్న ఈ బద్దకిస్టు లేదా సాచివేత వైఖరి ప్రమాదంగా మారి మేయర్ ఎన్నికను ముందే ప్రమాదం వుంది.

డైవర్ట్‌ పాలిటిక్స్‌ చేయడం బాబు, లోకేష్‌కు అలవాటు

ఉప్పెనంత వసూళ్లు

హీరోలు దేవుళ్లా ఏందీ?

జగన్: దూకుడే.. ముందుచూపు ఏదీ?!