గ్యాసిప్ లు రెండు రకాలు…విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసేవి. ఈ రోజు చదివి రేపు మరిచిపోతారులే అని కిట్టించేసేవి. యూ ట్యూబ్ థంబ్ నెయిల్స్ మాదిరిగా, ఈ రెండో తరహా గ్యాసిప్ లు పెరుగుతున్నాయి. అయితే ఇండస్ట్రీ జనాలు ఇలాంటివి చదివి వాళ్లలో వాళ్లు నవ్వుకుని ఊరుకుంటారు. కానీ దర్శకుడు మారుతి అలా ఊరుకోలేదు. స్మూత్ గా గట్టి జవాబు ఇచ్చారు.
మారుతి-గోపీచంద్ కాంబినేషన్ లో రాబోతున్న పక్కా కమర్షియల్ సినిమాలో అనసూయ వేశ్య క్యారెక్టర్ చేస్తోందంటూ ఎవరో గ్యాసిప్ పుట్టించేసారు. అది చాలక, దాన్ని వైరల్ చేసేయాలని ట్విట్టర్ లో కూడా పెట్టేసారు.
దానికి మారుతి చాలా స్మూత్ గా సమాధానం ఇచ్చేసారు. మీ ఆసక్తికి ధన్యవాదాలు. కానీ నా సినిమాలో అలాంటి క్యారెక్టర్ ఏదీ లేదూ అంటూ. అది నిజమే కూడా. మారుతి సినిమా పక్కా కమర్షియల్ లో అనసూయ నటించడమూ లేదు. ఆ సినిమాలో పాస్టిట్యూట్ క్యారెక్టరూ లేదు.
సినిమాలో అనసూయ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయదగిన పాత్ర వుంది కానీ అది వ్యాంప్ కాదు, పాస్టిట్యూట్ నూ కాదు. జస్ట్ ఓ పాత్రకు భార్య మాత్రమే. ఖండిస్తూ పోవాలని కాదు కానీ ఖండించకపోతే, ఇలా అడ్డమైన గ్యాసిప్ లు వచ్చి, క్రెడిబులిటీ వున్న గ్యాసిప్ లు కూడా క్రెడిబులిటీ లేకుండా పోతాయ్.