Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఉషాకిరణ్ లో ఆది?

 ఉషాకిరణ్ లో ఆది?

చుట్టాలబ్బాయి తరువాత మళ్లీ మరో సినిమా ఓకె అన్న దాఖలాలు లేవు హీరో ఆది సాయికుమార్ కు.  ఆ మధ్య కన్నడంలో కార్తికేయ రీమేక్ చేస్తారని వార్తలు వినవచ్చాయి. కానీ అలా కన్నడంలో చేయడం అన్నది టాలీవుడ్ కు రాంగ్ సిగ్నల్స్ ఇస్తుందని ఆలోచించి ఆగిపోయారు. లేటెస్ట్ గా ఆది ఓ సినిమా ఓకె చేసినట్లు తెలుస్తోంది.

కాస్త క్వాలిటీ సినిమాలు తెరకెక్కించాలని తాపత్రయ పడే ఉషాకిరణ్ మూవీస్ సంస్థ కోసం ఆది ఓ సినిమా సైన్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో బీరువా వంటి సినిమాను రూపొందించిన కణ్మణి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుందని తెలుస్తోంది.

 ఈ సినిమాతో పాటు ఓ తమిళ రీమేక్ కు కూడా ఆది ఒకె చేసినట్లు తెలుస్తోంది. ఉషాకిరణ్ సినిమా తీసి కొంతకాలం అయింది. త్వరలో ఈ సినిమా సెట్ మీదకు వెళ్తే అవకాశం వుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్ లో వుందని వినికిడి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?