వద్దన్నా పెళ్లి చేస్తున్న మీడియా

ఒక్కోసారి అంతే, ఎక్కడో ఏదో చిన్న మిస్టేక్ జరుగుతుంది. దాంతో ఒక వార్త పుట్టుకువచ్చేస్తుంది. ఇప్పుడు టాలీవుడ్ లో అలాంటివార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. డైరక్టర్ మారుతి హీరో శర్వానంద్ తో ఒక సినిమా…

ఒక్కోసారి అంతే, ఎక్కడో ఏదో చిన్న మిస్టేక్ జరుగుతుంది. దాంతో ఒక వార్త పుట్టుకువచ్చేస్తుంది. ఇప్పుడు టాలీవుడ్ లో అలాంటివార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. డైరక్టర్ మారుతి హీరో శర్వానంద్ తో ఒక సినిమా చేయబోతున్నాడన్నది ఆ వార్త. కానీ కిలోమీటర్లకు, కిలోమీటర్ల దూరంలో అలాంటి ప్రాజెక్టే లేదన్నది వాస్తవం. మారుతి ఇప్పుడు వర్క్ చేస్తున్నది కోనేరు హవీష్ హీరోగా యువి క్రియేషన్స్ నిర్మించే సినిమా మీదనే. ఆ తరువాత సినిమా ఏమిటి అన్నది ఇంకా ఇప్పటికి ఫిక్స్ కాలేదు. 

అయితే అఖిల్ అక్కినేనికి మాత్రం మారుతి ఓ లైన్ చెప్పడం, అది ఓకె కావడం జరిగింది. అది ఎప్పుడు వుంటుందో అన్నది మాత్రం ఫిక్స్ కాలేదు. మారుతి చేతిలో అయిదారు ప్రాజెక్టులు అయితే వున్నాయి, నిర్మాతల పరంగా, కానీ హీరోలు ఎవరూ ఇంకా డిసైడ్ కాలేదు. 

అయితే శర్వానంద్ వార్త ఎలా పుట్టిందీ అంటే, కోనేరు హవీష్ తో మారుతి చేస్తున్న సినిమా నిర్మిస్తున్నది యువి క్రియేషన్స్. గతంలో ఈ సంస్థ శర్వానంద్ తో రెండు సినిమాలు నిర్మించింది కాబట్టి, మారుతి ఆ బ్యానర్ లో సినిమా చేస్తున్నాడంటే, శర్వానే అని ఫిక్స్ చేసేసారన్నమాట. ఇప్పుడు ఈ గ్యాసిప్ నిజం చేయడం కోసమన్నా మారుతి అర్జెంట్ గా శర్వాకు ఓ లైన్ ఆలోచించి చెప్పాలి.