సినిమా రంగంలో హీరోలుగా నిలదొక్క కోవడం సంగతి అలా వుంచితే, ఎంట్రీ ఇవ్వాలంటే చాలా వరకు బ్యాకింగ్ వుండాల్సిన అవసరం అయితే వుంది. ఇది ఈజీ వే. కానీ విధి మాత్రం ఇంకోలా వుంటుంది. సక్సెస్ రావచ్చు. రాకపోవచ్చు. వారసులు అంతా నిలదొక్కుకోవాలని లేదు. కానీ కరోనా టైమ్ మరీ చిత్రంగా వుంది. వారుసులు నిలదొక్కుకోవడం, లేకపోవడం సంగతి సరే, అసలు ఎంట్రీ నే డిలే అయిపోతోంది.
మెగా టీమ్ లో మరో ప్లేయర్ అన్నట్లుగా రంగ ప్రవేశం చేసారు వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో ఫీల్డ్ లోకి అడుకు పెట్టారు. ఫస్ట్ లుక్, సాంగ్, ఇలా పబ్లిసిటీ మెటీరియల్ బాగుంది, కాస్త హోప్ వుంది అనుకునే సరికి సినిమా విడుదల ఆగిపోయింది. మళ్లీ ఎప్పుడు వస్తుందో వెయిట్ చేయాల్సిందే.
బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సాయి శ్రీనివాస్. అప్ అండ్ డౌన్స్ తో ఏదో కిందా మీదా ఈదుతూ వస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో తమ్ముడు సాయి గణేష్ కూడా రంగంలోకి దిగాడు. పవన్ సాదినేని డైరక్షన్ , వివేక్ ఆత్రేయ డైలాగులు. సినిమా ప్రారంభమై చాలా కాలం అయింది. కరోనా కు ముందు కూడా అప్ డేట్ లేదు. కరోనా టైమ్ లో సరేసరి.
నిర్మాత డివివి దానయ్య కుమారుడు తెరంగ్రేటం చేయాలని ఎప్పటి నుంచో మంచి సబ్జెక్ట్ కోసం చూస్తున్నారు. డైరక్టర్ మారుతి చేతుల మీదుగా అనుకున్నారు. కానీ మళ్లీ ప్లాన్ మారింది. దర్శకుడు శ్రీవాస్ మాంచి హిలేరియస్ సబ్జెక్ట్ తేవడంతో ప్రీ పొడక్షన్ మొదలు పెట్టారు. షూట్ అనౌన్స్ చేస్తారు అనుకునే లోగా కరోనా వచ్చి కూర్చుంది.
నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి తొలి సినిమా చేసారు. ఫరవాలేదు అనే టాక్ వచ్చింది. లైన్ లో మరో మంచి సినిమాలు రెండు వున్నాయి. ఒకటి దాదాపు పూర్తయింది. వెంట వెంటనే వస్తే, కుర్రాడు నిలదొక్కుకుంటాడు అనుకున్నారు. మళ్లీ మామూలే. కరోనా హ్యాండ్ బ్రేక్ వేసేసింది.
ఇలా తొలి సినిమాల కోసం వెయిట్ చేస్తున్న చిన్న, చితక హీరోలు ఇంకా వున్నారు. పాపం, వీరంతా కరోనా కాటు నుంచి ఎప్పుడు తప్పించుకుని, తెరపైకి వస్తారో?