వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు కొత్త వివాదం నెత్తిన పెట్టుకుంటున్నట్టు కనిపిస్తోంది. నిత్యం వివాదాలాతో కాపురం చేసే వర్మ ఇప్పుడు తెలుగు సెన్సార్ బోర్డ్ అధికారి ధన లక్ష్మి తో వివాదం పెట్టుకున్నాడు. కొందరు నిర్మాతలు సినిమా విడుదలకు ముందు ధనలక్ష్మి తో వివాదం పెట్టుకుంటే …వర్మ వెరైటీ గా సత్య-2 సినిమా రిలీజ్ తరువాత వివాదం లోకి దిగాడు.
సెన్సార్ బోర్డ్ అధికారిని ధనలక్ష్మి పై నాంపల్లి క్రిమినల్ కోర్ట్ లో క్రిమినల్ కేసు పెడతానని మీడియాకు ఎస్ ఎం ఎస్ లు పంపించాడు. ప్రెస్ నోట్ కూడా కాదు కేవలం ఎస్ ఎం ఎస్ లు మాత్రమె పంపాడు. అయితే సినిమా విడుదల అయిన తరువాత సెన్సార్ బోర్డ్ తో వివాదం ఏముంటుందని సినిమా వర్గాలు అంటున్నాయి. సెన్సార్ బోర్డ్ తో గొడవ పెట్టుకోవడం వర్మకు ఇది మొదటి సారి ఏమి కాదు. గతం లో ఒక సారి గోవింద గోవింద సినిమా సమయం లో కూడా సెన్సార్ బోర్డ్ తో గొడవకు దిగాడు.
ఏకంగా సెన్సార్ బోర్డ్ పై సినిమా తీస్తానని కూడా రాజకీయ నాయకుడిగా వర్మ ప్రకటన కూడా ఇచ్చాడు కాని ఇంతవరకు సెన్సార్ బోర్డ్ పై సినిమా తీసే పోరయట్నం చెయ్యలేదు. ఇప్పుడు చాలా ఏళ్ళ తరువాత సెన్సార్ బోర్డ్ పై నిప్పులు గక్కుతున్నాడు. దేనికైనా రెడీ సినిమా సమయం లో ఏకంగా మోహన్ బాబు కూడా ధనలక్ష్మి తో వివాదం పెట్టుకుని ఆమెను ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం కూడా చేశాడు. కాని మోహన్ బాబు పప్పులు కూడా ఏమి ఉడక లేదు. ఇప్పుడు ధనలక్ష్మి ముందు కొత్త వ్యక్తి వర్మ ఉన్నారు.
వర్మ ఏది చేసిన కేవలం పబ్లిసిటి కోసమే చేస్తాడనే టాక్ ఉంది కాబట్టి ఇది కూడా పబ్లిసిటి కోసమే నని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి. గతం లో ఒకసారి టి వి 9 తనను అవమాన పరచిందని , టి వి 9 పై కేసు నమోదు చెయ్యడానికి ఎ కె ఖాన్ కమీషనర్ దగ్గరికి వెళ్ళాడు. కాని ఇంతవరకు కేసు పెట్టిన దాఖలాలు కనిపించలేదు. వర్మ మాటలు ఎలా నమ్మగలరు. వర్మ ప్రకటన వెనుక మోహన్ బాబు హస్తం కూడా ఉండొచ్చని ఫిలిం నగర్ భావిస్తోంది. చూద్దాం ఎం జరుగబోతుందో.