‘నేనింకా చిన్న పిల్లనే..’ అన్న డైలాగ్ కొట్టడంలో ఛార్మి తెగ బోర్ కొట్టించేస్తోంది. చాలా తక్కువ వయసులోనే సినిమాల్లోకొచ్చేసింది ఛార్మి. ఇది నిజం. అయినా సరే, పదేళ్ళకు పైగానే ఆమె సినిమా హీరోయిన్‌గా చెలామణీ అయిపోతోంది. దాంతో, ఆమె వయసెంతయినా, ఆమె సీనియర్ హీరోయిన్ అన్నది నిర్వివాదాంశం.
పైగా, ఛార్మి హీరోయిన్‌గా వరుస పరాజయాలు చవిచూస్తుండడం, ఆ మధ్య శరీరమ్మీద అదుపు కోల్పోయి, బాగా లావెక్కడం.. ఇవన్నీ ఆమెకు పెద్దగా అవకాశాలు రాకుండా చేసేశాయి. ఇక ఇలా కాదనుకున్న ఛార్మి లుక్ మార్చేసింది. నాజూగ్గా తయారైపోయింది.
అలా నాజూగ్గా తయారైన ఛార్మి, హాట్ హాట్‌గా ఫొటోలకు పోజులిచ్చేసి, మళ్ళీ ఫ్రెష్‌గా రంగంలోకి దిగింది. హాట్ ఫొటోలకి అవకాశాలు రాలతాయా.? అన్నది కొన్ని రోజులాగితే తెలుస్తుందిగానీ, ఇంతకన్నా గ్లామరస్‌గా ఛార్మి చాలా సినిమాల్లోనే అందాలొలికించేసిందని సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు. అదీ సంగతి.