మెగా ఫ్యాన్స్ ఎంతగా అభిమానిస్తారో..అంతగా పట్టుదలగా కూడా వుంటారు. మెగా హీరోలు ఎక్కడికి వెళ్లినా ఓ ప్రోటోకాల్ వుంటుంది.
ముందుగా లోకల్ ఫ్యాన్స్ అసోసియేషన్ కు సమాచారం అందిస్తారు. దాంతో అక్కడి ఫ్యాన్స్ పర్టిక్యులర్ స్పాట్ కు వచ్చి వెయిట్ చేస్తారు. హీరోను పలకరిస్తారు. సెల్ఫీలు తీసుకుంటారు. ఆ మేరకు సినిమాను భుజాన మోస్తారు.
నిన్నటికి నిన్న అనిల్ రావిపూడితో కలిసి వరుణ్ తేజ్ విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లారు. కానీ అక్కడ లోకల్ ఫ్యాన్స్ కు సమాచారం లేదు. దాంతో కొంత మంది అలిగారు.
ఆ తరువాత విజయవాడ అభిమానులకు సమాచారం ఇచ్చారు. కానీ వరుణ్ టైమ్ సరిపోకనో, లేక బిజీగా వుండడం వల్లనో వారిని సరిగ్గా పలకరించడం, ఫొటోలు దిగడం చేయలేదని తెలుస్తోంది.
దీంతో అక్కడి ఫ్యాన్స్ అంతా వరుణ్ మీద అలిగినట్లు బోగట్టా. సినిమా మొదటి రోజు చూడకూడదని అక్కడి ఫ్యాన్స్ తీర్మానించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అసలే ఫ్యాన్స్ తో సంబంధాలు మెయింటెయిన్ చేయడంలో వరుణ్ తేజ్ టీమ్ కాస్త వీక్ అనే టాక్ వుంది. ఆ ప్రభావ్ ఓపెనింగ్ ల మీద పడుతోందని కూడా మెగా ఫ్యాన్స్ అంటుంటారు.