హీరోహీరోయిన్ల మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పండడం ఒకెత్తయితే… సినిమా సెట్స్ లో వాళ్ల మధ్య ఓ మంచి రిలేషన్ షిప్ ఏర్పడుతుంది. ఒకర్నొకరు బాగా అర్థం చేసుకుంటారు. అభిరుచులు పంచుకుంటారు. హీరోయిన్ నజ్రియాను కూడా అలానే అర్థం చేసుకున్నాడు హీరో నాని. పాపం నజ్రియా మాత్రం నానిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది.
అంటే సుందరానికి సినిమాలో కలిసి నటించింది ఈ జంట. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఎవరు, ఎవర్ని బాగా అర్థం చేసుకున్నారనే కోణంలో ఓ చిన్న క్విజ్ పెట్టారు. నజ్రియాకు ఇష్టమైన హాలిడే స్పాట్ ఏంటి, నజ్రియా రాశి ఏంటి, నజ్రియా మేనరిజమ్స్ ఏంటి, నజ్రియా ఎక్కువగా వాడే యాప్ ఏంటి లాంటి విషయాల్ని నాని కరెక్ట్ గా గెస్ చేశాడు.
అదే సమయంలో నజ్రియా మాత్రం నానికి సంబంధించి పూర్తిస్థాయిలో సమాధానాలు ఇవ్వలేకపోయింది. నానికి ఇష్టమైన సినిమా ఏంటనేది మాత్రం నజ్రియా చెప్పగలిగింది. మిగతా అన్ని విషయాల్లో దాదాపు ఫెయిలైంది.
నాని సమాధానాలు ఓసారి చూస్తే.. నజ్రియాకు యూరోప్ అంటే ఇష్టం. ఆమె రాశి పేరు ధనుస్సు. నజ్రియా ఎక్కువగా వాడే యాప్ ఇనస్టాగ్రామ్. ఇక నజ్రియా ఆన్సర్స్ చూస్తే, నానికి ఇష్టమైన సినిమా దళపతి.