తన తరువాతి సినిమా నాని హీరోగా చేద్దామన్నది దర్శకుడు అవసరాల శ్రీనివాస్ ప్లాన్. కానీ నాని ఇప్పట్లో ఖాళీ గా లేడు. అలా అని అర్జెంట్ గా ఏదో ఒక సినిమా చేయాలన్న ఆలోచనలోనూ అవసరాల లేడు. ఎందుకంటే నటుడిగా కూడా అతగాడి చేతిలో నాలుగైదు సినిమాలు వున్నాయి. నాని ఎప్పటికైనా సినిమా చేస్తా అని మాట ఇచ్చి వున్నాడు.
అయితే ఊహలు గుసగుస లాడే, జ్యో అచ్చ్యుతానంద సినిమాల తరువాత వెంకీ ప్లస్ ఒకరు లేదా ఇద్దరు యంగ్ హీరోలను జోడించి, ఓ మల్టీ స్టారర్ చేస్తే ఎలా వుంటుంది అన్న ఆలోచనలో అవసరాల వున్నట్లు తెలుస్తోంది. దీనికి తగ్గ లైన్, కథ కోసం అవసరాల ప్రస్తుతం ఆలోచనలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
కేవలం ఫన్ ను మాత్రమే కాకుండా మానవ భావోద్వేగాలను మిళితం చేస్తూ సినిమా చేయాలన్నది అవసరాల ఆలోచన. గత రెండు సినిమాల్లో కూడా ఇదే కనిపించింది. వెంకీ కోసం కూడా అలాంటి కథ తయారుచేయాలన్నది అవసరాల ఆలోచగా వుంది. వెంకీ ఖాళీ కావడానికి ఇంకా ఆరేడు నెలల పైనే పడుతుంది. ఆలోగా స్క్రిప్ట్ రెడీ అవుతుందేమో?