విక్టరీ వెంకటేష్-నాగ్ చైతన్య ల వెంకీ మామల విడుదల తేదీ డైలామా తీరిపోయినట్లే. ఆఖరికి రెండు డేట్ లు ఫైనల్ చేసారు. డిసెంబర్ ఆరు లేదా 25 అన్నది ఫైనల్ లిస్ట్ లోకి వచ్చింది. ఇక ఆ రెండు డేట్లలో ఒకదాన్ని నిర్మాతల్లో ఒకరైన సురేష్ బాబు ఫైనల్ చేయాల్సి వుంది.
మొత్తం మీద సంక్రాంతి రేస్ లోకి రావడం లేదు అన్నది క్లియర్ అయిపోయింది. అలాగే వెంకీ బర్త్ డే సందర్భంగా డిసెంబర్ 13 కూ రావడం లేదు అని క్లారిటీ వచ్చేసింది.
డిసెంబర్ 6న అయితే ఇరవై న సినిమాలు వచ్చేవరకు బాగా గ్యాప్ వుంటుంది. అలాగే 25 అంటే 12న సినిమాలు వచ్చేవరకు గ్యాప్ వుంటుంది. 6 డేట్ అయితే కాస్త ఎగ్జామ్స్ అడ్డంకి అయినా వుంటుంది. 25న అయితే అదీ వుండదు.
పైగా ఇరవైన విడుదలయిన సినిమాల వ్యవహారం 25 నాటికి తేలిపోతుంది. అందువల్ల ఎక్కువ మొగ్గు 25కే వుందని తెలుస్తోంది. రెండురోజుల్లో ఏ డేట్ అన్నది అధికారికంగా ప్రకటించే అవకాశం వుంది. పీపుల్స్ మీడియా పతాకంపై విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.