గతంలో సినిమాలలోకి పవన్ కళ్యాణ్ వెళుతున్నారని వార్తలు వస్తే తీవ్ర స్థాయిలో ఆ పార్టీ ఖండించేది. ఆ పార్టీ అదినేత పవన్ కళ్యాణ్ కూడా కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అనేవారు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి.
రాజకీయాల కోసం ఎవరి వ్యాపారాలు మానుకున్నారు?అని ఆయన ప్రశ్నిస్తున్నారు. నాకు తెలిసింది సినిమానే. రాజకీయాల కోసం ఎవరు వ్యాపారాలు మానుకున్నారు.
“అవంతి గారికి కాలేజీలు మూసేసి రాజకీయాల్లో ఉన్నారా? జగన్ గారికి జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ వ్యాపారాలు లేవా?” అని ప్రశ్నించారు.
సినిమా చేస్తారా అని ప్రశ్నించగా.. చేస్తానో లేదో తనకే తెలీదని.. నిర్మాతగా మాత్రం వ్యవహరిస్తానని పవన్ స్పష్టం చేశారు.