Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

‘వెంకీ’ ముక్కు పిండుతున్న ‘డివివి’?

‘వెంకీ’ ముక్కు పిండుతున్న ‘డివివి’?

టాలీవుడ్ లో ప్రతి ఒక్కరి దగ్గర నిర్మాత డివివి దానయ్య అడ్వాన్స్ వుంటుంది అని టాక్. దర్శకుడి కెరీర్ ఆరంభంలోనే అడ్వాన్స్ ఇచ్చి రుమాలు వేసేస్తారు. సినిమా చేసే వరకు ఓపిగ్గా వేచి వుంటారు. అలా వున్నందువల్లే రాజమౌళితో ఆర్ఆర్ఆర్ తీయగలిగారు. త్రివిక్రమ్ దగ్గర సైతం అడ్వాన్స్ వుంది. బోయపాటి, కొరటాల ఇలా చాలా మందితో సినిమాలు చేయగలిగారు. కానీ అదే డివివి దగ్గర తేడా వస్తే మరోలా వుంటుంది.

వడ్డీ ఉగ్గుపాలతో సహా అడ్వాన్స్ ను వెనక్కు కక్కిస్తారు. ఆ విషయం అస్సలు ‘తగ్గేదేలే’ అంటారు. సినిమా చేయడం కుదరకపోతే వడ్డీ, చక్రవడ్డీ, బారు వడ్డీ లెక్కలు రెడీ అవుతాయి. డబ్బులు వసూలు చేస్తారు. చాలా మంది ఇలా కట్టిన వాళ్లు కూడా వున్నారు. మారుతి, వెంకీ అట్లూరి ఇలా చాలా మంది డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకున్నవారే.

ఇప్పుడు ఈ పరిస్థితి దర్శకుడు వెంకీ కుడుముల కు వచ్చిందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. వెంకీ కుడుమల-మెగాస్టార్ సినిమా అనుకున్నారు. దీనికి దానయ్య నిర్మాత కానీ ఎందుకో కాలేదు. దీంతో వెంకీ ఇప్పుడు మైత్రీ సంస్థతో కలిసి నితిన్ తో సినిమా చేయబోతున్నారు. అందుకే తన అడ్వాన్స్ తనకు వెనక్కు ఇవ్వమని డివివి దానయ్య అడిగినట్లు తెలుస్తోంది. 

కేవలం అడ్వాన్స్ అడిగితే సమస్య ఏమీ లేదు. అసలు మెటీరియలైజ్ కాని మెగాస్టార్ ప్రాజెక్టు కోసం తను ఖర్చు చేసిందంతా ఇవ్వమని అడుగుతున్నట్లు తెలుస్తోంది. అవీ..ఇవీ..ప్లస్ వడ్డీలు ఇప్పుడు వెంకీ కుడుమల ఇచ్చుకోవాలన్నమాట. పంచాయతీలు నడుస్తున్నాయని ఇన్ సైడ్ వర్గాల బోగట్టా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?