'డియర్ కామ్రేడ్' విడుదలకి ముందు రౌడీ ఆటిట్యూడ్ మెయింటైన్ చేసి, దానినే ప్రమోట్ చేసుకున్న విజయ్ దేవరకొండ ఆ చిత్ర పరాజయం తర్వాత చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. పబ్లిక్‌తో ఇంటరాక్ట్ అయ్యేప్పుడు ఒక సిగ్నేచర్ స్టయిల్ మెయింటైన్ చేసే విజయ్ 'సైమా' ఈవెంట్‌లో మాత్రం అలాంటివేమీ చూపించలేదు.
మైక్ పట్టుకోవడం దగ్గర్నుంచి, మాట్లాడే విధానం వరకు అతనిలో స్పష్టమైన తేడా కనిపించింది. తాను చూపిస్తోన్న ఆటిట్యూడ్ మీడియాలో రాంగ్‌గా ప్రొజెక్ట్ అవుతుందనో, లేక తనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అనే విమర్శలని మినిమైజ్ చేయడానికో విజయ్ సడన్‌గా తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్నాడు.
యూత్‌కి నచ్చే రౌడీ ఇమేజ్‌ని కొనసాగించాలని చూసిన వాడే సడన్‌గా మాస్ చిత్రం చేస్తానంటూ పూరి జగన్నాథ్‌తో ప్రాజెక్ట్ కూడా ఓకే చేసేసుకున్నాడు. యువతని ఆకట్టుకునే తన శైలిని మార్చుకోవడంతో విజయ్ ఇతర వర్గాలకి దగ్గర కాగలడా లేక తన స్టయిల్ నచ్చే కుర్రాళ్లని కూడా దూరం చేసుకుంటాడా? ఏదేమైనా డియర్ కామ్రేడ్ ఫలితం అయితే విజయ్‌ని బాగానే ప్రభావితం చేసింది.