విజయ్ దేవరకొండకి యూత్‌లో మంచి ఫాలోయింగ్ వచ్చిన మాట వాస్తవమే. అతని చిత్రాలకి గ్యారెంటీ ఓపెనింగ్స్ ఇస్తోంది కాలేజీ యువతే. అదే సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్‌కి కూడా అతని సినిమాలు రీచ్ అయితే 'గీత గోవిందం' స్థాయిలో సక్సెస్ అవుతాయనేది తేలిపోయింది. అయినా కానీ యువతని మెప్పించడానికే విజయ్ ప్రాధాన్యత ఇస్తున్నాడు.
తనని రెబల్ తరహా పాత్రల్లో చూడ్డానికి యూత్ ఇష్టపడుతున్నారు కనుక ప్రతి సినిమాలోను అవే లక్షణాలున్న పాత్రలు చేస్తున్నాడు. ప్రతి చిత్రంలోను గడ్డం పెంచి కనిపించే ఫేజ్ ఒకటి వుండాలని దర్శకులని కోరుతున్నాడు. డియర్ కామ్రేడ్ ఫెయిల్ అయినా కానీ విజయ్ ఇంకా తన తప్పు రియలైజ్ అవలేదు. యూత్‌కి నచ్చే ఎలిమెంట్స్‌ని మాత్రం కవర్ చేస్తూ తన చిత్రాలు అన్ని వర్గాలకీ రీచ్ అయ్యేట్టు చూసుకోకపోతే తనకున్న క్రేజ్ వృధా అవుతుంది.
విజయ్ చిత్రాలని ఫ్యామిలీతో కలిసి స్ట్రీమింగ్ యాప్స్‌లో చూడాలన్నా కూడా ఆలోచించాల్సినట్టుగా కొన్ని అవసరం లేనివి బలవంతంగా తన సినిమాలలో ఇరికిస్తున్నాడు. ఈ విషయంలో తనని రైట్‌గా గైడ్ చేసేవాళ్లు లేకపోవడం, సినీ నేపథ్యం లేకపోవడం కూడా దీనికి కారణమే అని విశ్లేషకులు అంటున్నారు. అలాగే తన మాట చెల్లుబాటు అయ్యే దర్శకులతోనే చేస్తున్నాడు తప్ప తనని కమాండ్ చేసే వారికి ఛాన్స్ ఇవ్వట్లేదు.