గ్రామవాలంటీర్లంతా రేపిస్ట్ లా బాబూ..?

ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రజలెవరూ రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా.. వాటన్నిటి బాధ్యతలను వాలంటీర్లకు అప్పగిస్తూ సరికొత్త వ్యవస్థకు నాంది…

ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రజలెవరూ రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా.. వాటన్నిటి బాధ్యతలను వాలంటీర్లకు అప్పగిస్తూ సరికొత్త వ్యవస్థకు నాంది పలికారు. గ్రామవాలంటీర్ వ్యవస్థ ఎప్పటికైనా తనకు ముప్పే అని భావిస్తున్న చంద్రబాబు.. ఇప్పటికే లెక్కలేనన్ని విమర్శలు చేశారు. వాలంటీర్లంతా రేపిస్టులనే భావనలో మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రాను రాను చంద్రబాబు విమర్శలు మరీ దిగజారిపోతున్నాయనడానికి ఇది తాజా ఉదాహరణ. సోషల్ మీడియాలో తన స్థాయిని మరిచి పోస్టులు పెడుతూ పరువు పోగొట్టుకుంటున్న చంద్రబాబు.. ఇప్పుడు మీడియా సమావేశాల్లో కూడా తన శైలికి భిన్నంగా ఫ్రస్టేషన్ ని బైటపెట్టుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఓ మహిళ ఆత్మహత్య ఘటనను ఉదాహరణగా చూపిస్తూ వాలంటీర్ వ్యవస్థపై తన అక్కసునంతా వెళ్లగక్కారు చంద్రబాబు. వాలంటీర్ కోర్కె తీర్చనన్నందుకే ఆ మహిళ ఆత్మహత్య చేసుకుందని విచారణ లేకుండానే తేల్చేశారు.

ఇటీవల ప్రకాశం జిల్లాలో ఓ చిన్నారి పేరుతో టీడీపీ నేతలే ముఖ్యమంత్రికి ఓ లేఖ రాసి దానిపై మీడియాలో పెద్ద రాద్ధాంతం చేశారు. ఇప్పుడు వాలంటీర్ వేధింపులతో మహిళ ఆత్మహత్యకు పాల్పడిందంటూ.. ఆ మహిళ పేరుతో రాసిన ఓ ఉత్తరాన్ని ఆధారంగా చూపించి మరోసారి నాటకానికి తెరతీశారు. వాలంటీర్లందరిపై రేపిస్ట్ ముద్ర వేసేందుకు కూడా వెనకాడలేదు బాబు. వాలంటీర్లంతా భర్తలు లేని సమయంలో ఇంటికెళ్లి తలుపుకొడితే.. మహిళల పరిస్థితి ఏంటి అని మొసలికన్నీరు కారుస్తున్నారు. వ్యవస్థలో లోపాలుంటే సరిదిద్దుకోమని చెప్పాలి కానీ, ఇలా వ్యవస్థనే లేకుండా చేయాలని చంద్రబాబు డిమాండ్ చేయడం ఏంటి?

ఇటీవల రాష్ట్రంలో ఎక్కడ ఏ వ్యక్తిగత గొడవ జరిగినా దాన్ని ప్రభుత్వ వైఫల్యంగా చూపించడం చంద్రబాబుకు ఆనవాయితీ అయిపోయింది. పాతకక్షల్ని కూడా కొత్తగా తెరపైకి తెస్తూ వాలంటీర్లను టార్గెట్ చేస్తున్న సంఘటనలు చాలానే బైటకొస్తున్నాయి. ఇలా స్థాయిమరిచి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు కూడా వాలంటీర్లను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి. గతంలో జన్మభూమి కమిటీల పేరుతో తాను చేయించిన అరాచకాలన్నీ ఇప్పుడు చంద్రబాబు కళ్లముందు కదలాడుతున్నాయి కాబోలు, అందుకే వాలంటీర్లను కూడా అదేగాటన కట్టేయడానికి చూస్తున్నారు. 

రాజమౌళికి హ్యాట్సాఫ్ చెప్తున్నా.. సైరా డైరెక్టర్