Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

విజయ్ ఓకె.. కానీ నాని నో

విజయ్ ఓకె.. కానీ నాని నో

ఎన్టీఆర్-ఎఎన్నార్ క్యారెక్టర్లు రెండూ మహానటి సినిమాకు భలే ఇబ్బందిగా మారాయి. ఎఎన్నార్ క్యారెక్టర్ తో సమస్య రావడం లేదు. ఎన్టీఆర్ క్యారెక్టర్ తోనే సమస్య అంతా.

నాగ చైతన్యను-ఎన్టీఆర్ ను ఈ రెండు పాత్రల్లో చూడాలన్నది దర్శకుడి కోరిక. కానీ ఎన్టీఆర్ ససేమిరా అని చెప్పేసాడు. నాగ చైతన్య తనకు ఒకె కానీ, ఎన్టీఆర్ చేస్తేనే తను చేస్తా అన్నాడు.

దాంతో విజయ్ దేవరకొండ ఎఎన్నార్ గా, నాని ఎన్టీఆర్ గా అని ప్లాన్ చేసారు. దానికి విజయ్ దేవరకొండ ఒకె అనేసాడు. కానీ నాని నో అన్నాడు. అంటే ఎఎన్నార్ దొరుకుతున్నారు. ఎన్టీఆర్ నే దొరకడం లేదు.

దాంతో మళ్లీ వెదుకులాట ప్రారంభమైంది, ఎందుకువచ్చిన తలనొప్పి గ్రాఫిక్స్ లో కానిచ్చేద్దాం అనుకుంటే, ఇప్పటికే మార్చి నెలాఖరున అనుకన్న డేట్ కు వస్తుందా అన్నది అనుమానంగా వుంది. అప్పుడు మరీ ఆలస్యం అవుతుంది.

కానీ ఎన్టీఆర్ పాత్ర అంటే కాస్త నోటెడ్ ఫేస్ కావాలి. అంటే స్టార్ స్టేటస్ వున్నవాళ్ళు కావాలి. ఎవరు? ఎవరు? ఎవరు? ఈలోగా ఎవరికి తోచిన పేర్లు వాళ్లు ఫిల్లింగ్ ది బ్లాంక్స్ లో చేర్చేస్తున్నారు. కానీ ఒక్కో పేరు పక్కకిపోతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?