ఆ ఇద్దరి పెళ్లి ఇప్పట్లో కాదు

విజయ్ కాస్త వీలు చూసుకుని, తనకు టైమ్ కుదరినంత మాత్రానే పెళ్లి ఇతరత్రా కార్యక్రమాల ఆలోచన ఇప్పట్లో లేదన్నారు.

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ విజయ్ దేవరకొండ. మోస్ట్ క్రేజీఎస్ట్ హీరోయిన్ రష్మిక. వీరిద్దరూ ప్రేమలో వున్నారు. పెళ్లి చేసుకుంటారు అన్న వార్తలు ఇవాళ నిన్నటివి కావు. పైగా తాము ప్రేమలో వున్నాము అన్న వార్తలు రాకుండా చేయాలని ఆ ఇద్దరూ ఏ నాడూ అనుకోలేదు. ఇన్‌స్టా లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి సినిమాల ప్రమోషన్ వరకు ఏదో రూపంలో వీరి మధ్య ప్రేమ బయటకు వస్తూనే వుంది.

ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ తమ కెరీర్‌లో బిజీగా వున్నారు. అసలు పెళ్లి ఆలోచన చేసే ఖాళీ లేదు. అయితే ఇటీవల కొంత కాలంగా ఈ నెలలో చిన్న ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్ లాంటిది క్లోజ్డ్ డోర్స్‌లో ప్లాన్ చేస్తున్నారు అనే గాసిప్ వినిపిస్తోంది. ఈ మేరకు ఫ్యామిలీ మెంబర్స్ షాపింగ్ కూడా చేస్తున్నారనే మాటలు కూడా వినిపించాయి.

ఇంకెదుకు నేరుగా పెద్దవారినే అడిగేస్తే సరిపోతుంది కదా, అని విజయ్ ఫాదర్ గోవర్ధన్ ను అడిగితే, విజయ్ ఇప్పుడు ఫుల్ బిజీగా వున్నారని, గౌతమ్ తిన్ననూరి సినిమా జరుగుతోందని, సంక్రాంతి తరువాత మైత్రీ మూవీస్ సినిమా వుంటుందని, అది కొంత షూట్ అయ్యాక, దిల్ రాజు నిర్మాతగా సినిమా స్టార్ట్ అవుతుందన్నారు.

అందువల్ల విజయ్ కాస్త వీలు చూసుకుని, తనకు టైమ్ కుదరినంత మాత్రానే పెళ్లి ఇతరత్రా కార్యక్రమాల ఆలోచన ఇప్పట్లో లేదన్నారు. కనీసం ఆరు నెలలు పడుతుందని అనుకుంటున్నా అన్నారు.

8 Replies to “ఆ ఇద్దరి పెళ్లి ఇప్పట్లో కాదు”

Comments are closed.