ఉత్తరాంధ్ర మీద జగన్ ఫోకస్

ఇప్పుడు జగన్ కూడా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి తన టూర్‌ని ఆరంభించడం ద్వారా ఫ్యాన్ జోరుని పెంచాలని చూస్తున్నారని అంటున్నారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర నుంచి టీడీపీ కూటమి మీద ప్రజా పోరాటానికి సమాయత్తమవుతున్నారని ప్రచారం సాగుతోంది. ఏపీలో వైసీపీకి అధికారాన్ని 2019లో ఉత్తరాంధ్ర ఇచ్చింది. అదే ఉత్తరాంధ్ర 2024 ఎన్నికల్లో వైసీపీకి హ్యాండ్ ఇచ్చింది. మొత్తం 34 అసెంబ్లీ సీట్లలో రెండు మాత్రమే వైసీపీకి దక్కాయి అంటే ఆ పార్టీకి అది ఎంతటి దారుణమైన ఫలితంగా మారిందో అని అంటున్నారు.

ఈ క్రమంలో పోయిన చోటనే వెతుక్కోవాలని భావిస్తున్న వైఎస్ జగన్ సంక్రాంతి తరువాత తాను ప్రారంభించే జిల్లా యాత్రలకు ఉత్తరాంధ్ర నుంచే శ్రీకారం చుట్టనున్నారు అని అంటున్నారు. ఉత్తరాంధ్రలో కూడా సెంటిమెంట్‌గా ఉన్న శ్రీకాకుళం జిల్లా నుంచి ఆయన మొదలెడతారు అని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఆరంభించే ఏ కార్యక్రమం అయినా ఏ పార్టీకి అయినా విజయాలనే చేకూరుస్తుంది అని అంటున్నారు.

గతంలో చంద్రబాబు కూడా శ్రీకాకుళాన్నే తన కార్యక్రమాలకు వేదికగా ఎంచుకునేవారు. ఇటీవల ఆయన ముఖ్యమంత్రి హోదాలో దీపం పథకాన్ని శ్రీకాకుళం జిల్లా నుంచే ప్రారంభించారు. ఇప్పుడు జగన్ కూడా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి తన టూర్‌ని ఆరంభించడం ద్వారా ఫ్యాన్ జోరుని పెంచాలని చూస్తున్నారని అంటున్నారు.

శ్రీకాకుళం జిల్లాను టీడీపీ కూటమి 2024 ఎన్నికల్లో స్వీప్ చేసి పారేసింది. వైసీపీలో అక్కడ నిస్తేజం ఆవరించింది. సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కూడా సైలెంట్ అయ్యారు. దాంతో ఈ జిల్లా నుంచే వైసీపీని యాక్టివ్ చేయాలన్నది జగన్ ఆలోచనగా ఉంది అని అంటున్నారు. శ్రీకాకుళం మీద జగన్ ఫోకస్ పెట్టడంతో అక్కడ రాజకీయం మారే అవకాశం ఉంది. లేటెస్ట్‌గా శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలను తాడేపల్లికి పిలిపించుకుని జగన్ దిశానిర్దేశం చేశారు. రానున్న రోజులలో ఉత్తరాంధ్ర నుంచే కూటమి మీద పోరుకు జగన్ వైసీపీని సిద్ధం చేస్తున్నారు అని అంటున్నారు.

24 Replies to “ఉత్తరాంధ్ర మీద జగన్ ఫోకస్”

  1. దేశవ్యాప్తంగా కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. ఇందులో ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలను కేటాయించారు. 

    రాష్ట్రంలో అనకాపల్లి, చిత్తూరు జిల్లా వలసపల్లె, సత్యసాయి జిల్లా పాలసముద్రం, గుంటూరు జిల్లా తాళ్లపల్లె, పల్నాడు జిల్లా రొంపిచెర్ల, కృష్ణా జిల్లా నందిగామ, ఏలూరు జిల్లా నూజివీడు, నంద్యాల జిల్లా డోన్ లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. 

    కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలుగా కేంద్రీయ విద్యాలయాలకు పేరుంది. వీటిలో సీబీఎస్ఈ సిలబస్ తో బోధన ఉంటుంది. విద్యా ప్రమాణాల పరంగా కేంద్రీయ విద్యాలయాలు ఉన్నతస్థాయిలో ఉంటాయి.

  2. టెక్కలి ఎమ్మెల్యే సీటు లక్ష్మి పార్వతి కి ఇస్తే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుంది..

    1. నెక్స్ట్ సీఎం సీటు అడుగుతుందని .. ఆ మొరిగే కుక్కని ఇంటి బయటే ఉంచుతాడు జగన్ రెడ్డి..

  3. ముందు తనమీద తను ఫోకస్ చేసుకోమను..బలుపు తగ్గించుకుని, పక్క పార్టీ వాళ్ళని బూతులు తిట్టనివ్వకుండా, మింగుడు తగ్గించి, కుల ద్వేషం తగ్గించి నడవడిక మార్చుకుంటేనే భవిష్యత్తు..లేకపోతే అస్సామే

  4. ముందు-తనమీద-తను-ఫోకస్-చేసుకోమను..

    .

    బలుపు-తగ్గించుకుని, పక్క-పార్టీ-వాళ్ళని-బూతులు -తిట్టనివ్వకుండా, మింగుడు-తగ్గించి, కుల-ద్వేషం తగ్గించి-నడవడిక-మార్చుకుంటేనే-భవిష్యత్తు..లేకపోతే-అస్సామే

  5. అప్పట్లో వైజాగ్ వస్తున్నాడు….లెగిస్తే మనిషి కాదు అని ఎలెవషన్…ఇప్పుడు ఇలా

Comments are closed.