రేవంత్ నోటికి హ‌ద్దూ, అదుపూ లేదు

అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్‌, అలాగే బీజేపీ నేత‌ల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది

తెలంగాణ రాజ‌కీయాలు ఫైర్ మీద ఉన్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్‌, అలాగే బీజేపీ నేత‌ల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. ఈ నెల 9 నుంచి జ‌ర‌గ‌నున్న తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు హీటెక్క‌నున్నాయి. అసెంబ్లీ స‌మావేశాల‌కు వ‌చ్చి త‌మ ప్ర‌భుత్వానికి స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చి పెద్ద‌రికం చాటుకోవాల‌ని మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఇప్ప‌టికే అప్పీల్ చేసిన సంగ‌తి తెలిసిందే.

అలాగే కేటీఆర్‌, హ‌రీశ్‌రావు పిల్ల చేష్ట‌లు చేస్తున్నార‌ని, కాస్త అదుపులో పెట్టాల‌ని రేవంత్ సూచించారు. ఈ నేప‌థ్యంలో సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చారు. డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా శుక్ర‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న‌కు కేటీఆర్ నాయ‌క‌త్వంలో ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ సీఎంపై విరుచుకుప‌డ్డారు.

ఈ నెల 9న రేవంత్‌రెడ్డి స‌ర్కార్ ప్ర‌తిష్ట చేస్తున్న‌ది తెలంగాణ త‌ల్లా? లేక కాంగ్రెస్ త‌ల్లి విగ్ర‌హాన్నా? అని ప్ర‌శ్నించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానం అనేది అస‌లు విష‌య‌మే కాద‌న్నారు. త‌మ‌కు తెలంగాణ త‌ల్లి ముఖ్య‌మ‌న్నారు. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హావిష్క‌ర‌ణ అంటే రేవంత్‌రెడ్డి ఇంటి కార్య‌క్ర‌మం కాద‌ని కేటీఆర్ చుర‌క‌లు అంటించారు. త‌మ నాయ‌కుడు కేసీఆర్ తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన‌ప్పుడు రేవంత్‌రెడ్డి ఎక్క‌డున్నార‌ని కేటీఆర్ నిల‌దీశారు.

కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి నోటికి హ‌ద్దు, అదుపు లేకుండా పోయింద‌ని కేటీఆర్ మండిప‌డ్డారు. ఒక‌ప్పుడు సోనియాగాంధీని తెలంగాణ బ‌లిదేవ‌త అన్నాడని, ఇప్పుడు తెలంగాణ త‌ల్లి అంటున్నాడ‌ని త‌ప్పు ప‌ట్టారు. రేవంత్ ద‌గ్గ‌ర కేసీఆర్ మ‌ర్యాద నేర్చుకునే ప‌రిస్థితిలో లేర‌న్నారు. కేసీఆర్‌ను గౌర‌విస్తేనే, సీఎంగా రేవంత్‌రెడ్డిని గౌర‌విస్తామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

9 Replies to “రేవంత్ నోటికి హ‌ద్దూ, అదుపూ లేదు”

  1. రేవంత్ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు జాతిని విడదీసిన ఈ పాపాత్మపు ఫ్యామిలీకి లేదు.
    తెలంగాణ పేరు చెప్పి ప్రజలని వంచిచి అవినీతి సొమ్ము వెనక వేసుకుని సిగ్గు లగ్గ లేకుండా మాట్లాడుతున్నారు

Comments are closed.