రాజ్య‌సభలో తెలంగాణ ఎంపీ సీటు వద్ద నోట్ల కట్ట

రాజ్య‌సభలో కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ సీటు వద్ద నోట్ల కట్ట లభ్యమైంది. దీంతో సభలో కలకలం రేగింది.

రాజ్య‌సభలో కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ సీటు వద్ద నోట్ల కట్ట లభ్యమైంది. దీంతో సభలో కలకలం రేగింది. తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ తరపున అభిషేక్ సింఘ్వీ ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆయన సీటు వద్ద భారీ నగదు పట్టుబడడంతో విచారణకు ఆదేశించినట్టు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ వెల్లడించారు.

రాజ్యసభ చైర్మన్ మాట్లాడుతూ సాధారణ భద్రతా తనిఖీల్లో భాగంగా సభ వాయిదా పడిన తర్వాత సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు నిర్వహించారని చెప్పారు. ఈ సందర్భంలో సీటు నంబర్ 222 వద్ద రూ.500 నోట్లున్న భారీ నగదును గుర్తించారన్నారు. ఈ సీటు తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ అభిషేక్‌కు సంబంధించిందని ఆయన తెలిపారు.

ఇదిలా ఉండగా అభిషేక్ పేరు ప్రస్తావించడాన్ని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ మల్లికార్జున ఖర్గే తప్పు పట్టారు. ఆధారాలు లేకుండా తమ ఎంపీ పేరు ప్రస్తావించడం పూర్తిగా అభ్యంతరకరం అని ఆయన అన్నారు.

గతంలో దివంగత ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో లోక్‌సభలో నోట్ల కట్ట‌లు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. అప్పట్లో ఈ ఘటనా పార్లమెంట్‌ను కుదిపేసింది. ఇప్పుడు మరోసారి పార్లమెంట్‌లో నోట్ల కట్ట‌లు దొరకడం రాజకీయ రంగు పులుముకుంది. అసలు వాస్తవాలు ఏమిటో విచారణలో వెలుగు చూడనున్నాయి.

5 Replies to “రాజ్య‌సభలో తెలంగాణ ఎంపీ సీటు వద్ద నోట్ల కట్ట”

Comments are closed.