విజయ్ విజిల్ కు కలిసివచ్చిన వీకెండ్

కోలీవుడ్ హీరోలకు తెలుగునాట కాలం చెల్లిపోయింది అనుకుంటున్న టైమ్ లో హీరో విజయ్ సినిమా విజిల్ ఫస్ట్ వీకెండ్ లో మంచి ఫలితాలు నమోదు చేసింది. ఫస్ట్ వీకెండ్ తరువాత ఎలా వుంటుంది అన్నది…

కోలీవుడ్ హీరోలకు తెలుగునాట కాలం చెల్లిపోయింది అనుకుంటున్న టైమ్ లో హీరో విజయ్ సినిమా విజిల్ ఫస్ట్ వీకెండ్ లో మంచి ఫలితాలు నమోదు చేసింది. ఫస్ట్ వీకెండ్ తరువాత ఎలా వుంటుంది అన్నది పక్కన పెడితే తొలి మూడురోజులు మాత్రం మాంచి ఫలితాలు ఇచ్చింది. దాదాపు సగానికి పైగా రికవరీ వచ్చినట్లే.

సినిమాను కొన్ని ఏరియాల్లో స్వంతగా విడుదల చేసారని బోగట్టా. అందువల్ల బ్రేక్ ఈవెన్ లాంటి సమస్యలు పెద్దగా వుండవు. పైగా సరైన సినిమాలు ఏవీ మార్కెట్ లో లేవు. పెద్ద సినిమా అంటే ఇష్టపడే జనాలకు విజిల్ ఒక్కటే వుంది రెడీగా. అందువల్ల ఇంతో అంతో షేర్ వస్తూనే వుంటుంది ఈవారం అంతా.

విజిల్ తొలివారం వసూళ్లు ఇలా వున్నాయి.
నైజాం……. 1.92Cr
సీడెడ్…….. 1.71
ఉత్తరాంధ్ర., 0.67
ఈస్ట్..,,,,,… 0.45
వెస్ట్…………0.29
కృష్ణ……. – 0.44
గుంటూరు…. 0.81
నెల్లూరు……. 0.27

ఐదేళ్లపాటు నిండా ముంచేశారని ప్రజలు నమ్మారు