గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారంపై టీడీపీలో తలోమాట మాట్లాడుతున్నారు. వంశీని చంద్రబాబు వదులుకోరని ఒకనేత అంటే, వంశీ గందరగోళం సృష్టించరాదని మరోనేత అన్నారు. వాట్సప్ లో రాజీనామాలేమిటి? నాలుక గీసుకోవడానికి పనికిరాదని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ నేతల నుంచి ఇబ్బందులు వచ్చాయని చెప్పి, ఆయన అదే పార్టీలోకి ఎలా వెళతారని ప్రశ్నించారు. వంశీ గందరగోళం చేస్తున్నారని, దానికి ముగింపు పలకాలని ఆయన అన్నారు.
వాట్పప్ లో రాజీనామాలు ఏమిటని, ఆయన నిజంగా ఆమోదం పొందాలని అనుకుంటే నిర్దిష్ట ఫార్మాట్ లో రాజీనామా లేఖలు రాసి, పార్టీకి, స్పీకర్ కు పంపించాలని బొండా సూచించారు. మరోనేత అర్జునుడు మాట్లాడుతూ వంశీని చంద్రబాబు వదలుకునే ప్రసక్తి లేదని అన్నారు.
విజయవాడ ఎంపీ కేశినేని మాట్లాడుతూ కేసులకు భయపడి రాజకీయాలకు దూరం అవడం సరికాదని అన్నారు.