మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేష్ లు వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని వార్తలు వచ్చాయి.
గత ఎన్నికలలో పర్చూరు నుంచి పోటీచేసి దగ్గుబాటి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కాలంలో వెంకటేశ్వరరావు సతీమణి పురందేశ్వరి బిజెపి నేతగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న పరిస్తితి నేపద్యంలో దగ్గుబాటి దంపతులు ఏదో ఒక పార్టీలో ఉంటే మంచిదని వైసిపి నాయకత్వం సూచించిందని సమాచారం .
ఆ తర్వాత కుటుంబ పరంగా చర్చించుకుని వారు వైసిపి కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని, ఈ విషయాన్ని విజయసాయిరెడ్డికి తెలియచేశారని కదనం.
కాగా పర్చూరులో మరో నేత రామనాదబాబును వైసిపిలోకి తీసుకున్న సమచారం తమకు తెలియని దగ్గుబాటి పేర్కొన్నారు.