డైరక్టర్ పరుశురామ్ లైన్ కు హీరో మహేష్ బాబు ఓకె అన్నాడని వార్తలు వినవచ్చాయి. ఏదో ఒక పవర్ ఫుల్ మెసేజ్ వుంటే తప్ప సినిమాలు ఓకె చేయడం లేదు మహేష్ బాబు. ఆఫ్ కోర్స్.. అనిల్ రావిపూడి సినిమా దీనికి మినహాయింపు. అది అవుట్ అండ్ అవుట్ రివెంజ్ ఫార్ములా ఎంటర్ టైన్ మెంట్ జోనర్. మరి ఇలాంటి నేపథ్యంలో పరుశురామ్ ఏం లైన్ చెప్పి వుంటాడు? తనకు అచ్చి వచ్చిన పక్కా ఫ్యామిలీ జోనర్ నే చెప్పి వుంటాడా? మహేష్ రేంజ్ కు అది సరిపోతుందా? ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
డైరక్టర్ పరుశురామ్ దగ్గర బ్యాంక్ లకు టోపీ పెట్టి, కోట్లు పట్టుకుని విదేశాలకు చెక్కేసిన బడా బాబుల నేపథ్యంలో ఓ కథ వున్నట్లు వందంతులు వినిపిస్తున్నాయి. హీరో తల్లి బ్యాంక్ ఎంప్లాయి. విలన్ కోట్ల రుణాలు తీసుకుని విదేశాలకు వెళ్లిపోవడం వల్ల ఆమె టార్గెట్ అవుతుంది. ఈ నేపథ్యంలో హీరో విదేశాలకు వెళ్లి, విలన్ ను బురిడీ కొట్టించి, లేదా ఢీకొట్టి ఎలా డబ్బులు వసూలు చేసాడన్నది పాయింట్ అని ఇండస్ట్రీ సర్కిళ్లలో వినిపిస్తోంది.
పాయింట్ కాస్త కాంటెంపరరీ గానే వుంది. మరి ఇది ఎలా తయారువుతుందో? అసలు ఇదే సబ్జెక్ట్ నో కాదో తెలియాలంటే ఇంకా చాలాకాలం ఆగాలి. ఇదిలావుంటే మజిలీ సినిమాతో హిట్ కొట్టిన శివనిర్వాణ కూడా ఓసారి మహేష్ ను కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే సందీప్ వంగా కూడా మరో లైన్ ను మహేష్ కు వినిపించినట్లు బోగట్టా.
ఇవన్నీ ఇలావుంటే దర్శకుడు సుకుమార్ ఈసారి బౌండ్ స్క్రిప్ట్ ను మహేష్ కోసం రెడీ చేసినట్లు తెలుస్తోంది. మహేష్ ఇచ్చిన ఝలక్ తో బౌండ్ స్క్రిప్ట్ చేసి, ఆయన ఎప్పుడు అంటే అప్పుడు అన్నట్లు పక్కన పెట్టినట్లు బోగట్టా.