విశ్వంభర- తెలుగు రాష్ట్రాలు 120 కోట్లు!

మెగాస్టార్ తో యువి సంస్ధ నిర్మిస్తున్న సినిమా విశ్వంభర. భారీ గ్రాఫిక్స్ తో తయారవుతున్న సోషియో ఫాంటసీ సినిమా. 2025 సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఇప్పుడు మెల్లగా మార్కెట్ స్టార్ట్ చేసారు. Advertisement హొల్…

మెగాస్టార్ తో యువి సంస్ధ నిర్మిస్తున్న సినిమా విశ్వంభర. భారీ గ్రాఫిక్స్ తో తయారవుతున్న సోషియో ఫాంటసీ సినిమా. 2025 సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఇప్పుడు మెల్లగా మార్కెట్ స్టార్ట్ చేసారు.

హొల్ సేల్ గా రెండు తెలుగు రాష్ట్రాల హక్కులు అంటే నైజాం, సీడెడ్, ఆంధ్ర కలిపి అమ్మేసే దిశగా చర్చలు సాగుతున్నాయి. నిర్మాతలు ఏకంగా 120 కోట్లు కోట్ చేస్తున్నారు. అంటే ఎన్టీఆర్ దేవర కన్నా పెద్ద రేటు అన్నమాట.

ఈ రేటు మీద డిస్కషన్లు ప్రారంభమయ్యాయి. ఓ యంగ్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ సినిమాను తీసుకునేందుకు సిద్దమయ్యారు. కానీ అంత రేటు కు కాదు. బేరాలు ప్రారంభించారు. ఒకటి రెండు రోజుల్లో ఓ కొలిక్కి వస్తుంది వ్యవహారం. 120 కోట్లు అంటే ఆంధ్ర 60 కోట్ల వరకు నైజాం 45 కోట్ల వరకు సీడెడ్ 15 వరకు వుండే అవకాశం వుంది. కానీ ఇంత రేటు రావాలంటే సినిమా భారీ సక్సెస్ కావాలి. ఇక్కడ వున్న హోప్ ఒక్కటే సంక్రాంతికి వస్తుండడం అన్నది.

మెగాస్టార్ ఇంతకు ముందు సినిమా, సంక్రాంతికి వచ్చిన వాల్తేర్ వీరయ్య 110 కోట్లకు పైగా షేర్ సాధించింది అని మార్కెట్ వర్గాల బోగట్టా. అందువల్ల అదే రేటును విశ్వంభర కు ఫిక్స్ చేసినట్లు కనిపిస్తోంది. సంక్రాంతికి వస్తుంది. టికెట్ రేట్ల పెంపు పెద్ద కష్టం కాదు. అందుకే అంత భారీ రేటు కోట్‌ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులు మంచి రేటుకు విక్రయించేసారు.

13 Replies to “విశ్వంభర- తెలుగు రాష్ట్రాలు 120 కోట్లు!”

Comments are closed.