రావు రమేష్ హ్యాపీ.. కానీ..!

తొలిసారిగా కీలకపాత్రలో నటించారు నటుడు రావు రమేష్ మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో. ఇప్పటి వరకు సినిమాల్లో ప్రతి నాయక పాత్రలు, కీలకపాత్రలు అన్నీ చేసారు కానీ, సినిమాలో తనదే ప్రధాన పాత్ర అనే విధంగా…

తొలిసారిగా కీలకపాత్రలో నటించారు నటుడు రావు రమేష్ మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో. ఇప్పటి వరకు సినిమాల్లో ప్రతి నాయక పాత్రలు, కీలకపాత్రలు అన్నీ చేసారు కానీ, సినిమాలో తనదే ప్రధాన పాత్ర అనే విధంగా చేసింది లేదు. అందువల్ల చాలా టెన్షన్ తోనే చేసారు.

సినిమా విడుదలైన తరువాత మిక్స్ డ్ టాక్ వచ్చినా, రావు రమేష్ బాగా చేసారు అనే మాట గట్టిగా వినిపించింది. రావు రమేష్ నే సినిమాలో ఎక్కువగా ఫన్ పండించడంతో మెల్లగా మౌత్ టాక్ స్ప్రెడ్ కావడం మొదలైంది. ఫస్ట్ వీకెండ్ తరువాత సినిమా మెల్లగా సెటిల్ కావడం మొదలైంది.

దర్శకుడు సుకుమార్ భార్య సమర్పించిన ఈ సినిమాకు ప్రీ పబ్లిసిటీ గట్టిగా జ‌రిగింది. బన్నీ కూడా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు రావడంతో కాస్త క్రేజ్ వచ్చింది. అయితే సినిమా పూర్తిగా జ‌నాలకు రీచ్ కావడానికి మాత్రం మూడు రోజులు పట్టింది. కమిటీ కుర్రాళ్లు, ఆయ్ సినిమాల రన్ సెటిల్ కావడానికి కూడా ఇలాగే మూడు రోజులు పట్టింది. ఇప్పుడు మారుతీనగర్ కూడా అలాగే టైమ్ తీసుకుంది.

ఇక ఇప్పుడు కాస్త సినిమాను జ‌నంలోకి బలంగా తీసుకెళ్లాలి. ఈ విషయంలో కమిటీ కుర్రాళ్లు, ఆయ్ టీమ్ లు అస్సలు గ్యాప్ లేకుండా కష్టపడ్డాయి. అక్కడ వున్నది అంతా యంగ్ టీమ్, నీహారిక, బన్నీవాస్ అంతా కలిసి రెండు రాష్ట్రాల్లో ఎంతలా ప్రమోట్ చేయాలో అంతా చేసారు. ఇక్కడ ఏం చేయాలన్నా రావు రమేష్ మాత్రమే చేయాలి. కానీ ఆయన సినిమా విడుదల ముందే పెద్దగా చేయలేదు. విడుదలైన తరువాత అయినా గట్టిగా చేస్తే సినిమా మరింత రీచ్ అవుతుంది.

5 Replies to “రావు రమేష్ హ్యాపీ.. కానీ..!”

  1. కమ్మోడు అంటే దోపిడి.. 

    TDP అంటే దోపిడి.. 

    కింద చెప్పిన ఫ్యామిలీస్ అన్నీ దాదాపు ప్రతి ఒక్కరికి 10-15 వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఉంటాయి.

    మన ఆంధ్ర తెలంగాణలో వేల కోట్లు దోచుకున్న కొన్ని k-బాచ్ బ్యాచ్ ఫ్యామిలీస్

    రామోజీరావు 

    నందమూరి

    పురందేశ్వరి 

    చంద్రబాబు

    దగ్గుపాటి

    అక్కినేని

    రాయపాటి 

    సుజనా చౌదరి 

    సీఎం రమేష్ 

    లింగమనేని

    దగ్గుపాటి పురందేశ్వరి

    గంటా జయదేవ్

    లగడపాటి

    కేశినేలేని

    మురళీమోహన్

    భవ్య కన్స్ట్రక్షన్స్

    వీళ్లంతా మనల్ని నిలువు దోపిడీ చేసి వేల కోట్లు సంపాదించుకున్నారు

Comments are closed.