మాటలు విసురుకున్న శివాజీరాజా, హేమ బాగానే వున్నారు. కానీ మధ్యలో పవన్ కళ్యాణ్ ను పంచాయతీ చేయమంటున్నారట. మా ఎన్నికల సందర్భంగా శివాజీ రాజా మీద మాటలు విసిరింది హేమ. దానికి రియాక్టయ్యాడు శివాజీ రాజా. దాంతో హేమ బుస్సుమంది. పోలీసుల దగ్గరకు వెళ్లింది. సినిమా పెద్ద దాసరి దగ్గరకూ వెళ్లింది.ఎక్కడా పని జరగలేదు.
అసలు ఏమన్నా పెద్ద వివాదం వుంటేగా..వడ్ల గింజలో బియ్యం గింజ. ఈమే ఓ మాట అంది..ఆయనో మాట అన్నాడు. ఇప్పుడు ఈ వివాదాన్ని ఇంతటితో వదలనంటోందట హేమ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లి న్యాయం అడుగుతుందట. ఆయన స్పందిచకుంటే ఆ ఇంటి ముందే దీక్షకు దిగుతుందట. ఇది మరీ బాగుంది.
ఇప్పుడు ఈమె మొత్తానికి పవన్ ను సినిమా పంచాయతీ పెద్దను చేసేటట్టు వుంది. ఇలా అయితే కష్టమే. అసలే రాజకీయాలు పార్ట్ టైమ్ గా చేస్తుంటేనే, సినిమాలు చేయడం లేదు. ఇక ఈ పంచాయతీలు కూడా తలకెత్తుకుంటే, అస్సలు ఖాళీ వుండదు పవర్ స్టార్ కు.