తానా ఎన్నికలు – ఒక విశ్లేషణ

ఈ సారి జరుగుతున్న తానా ఎన్నికలు గత రెండు దశాబ్దాలులలో మొదటిసారి అత్యంత ఆసక్తికరంగా మారి ఇండియా లోను అమెరికాలోను మిక్కిలి ఉత్కంట కలిగించుతూ ఉన్నాయి. ప్రస్తుతం రెండు వర్గాలు ముఖాముఖి పోరులో దీటుగా…

ఈ సారి జరుగుతున్న తానా ఎన్నికలు గత రెండు దశాబ్దాలులలో మొదటిసారి అత్యంత ఆసక్తికరంగా మారి ఇండియా లోను అమెరికాలోను మిక్కిలి ఉత్కంట కలిగించుతూ ఉన్నాయి. ప్రస్తుతం రెండు వర్గాలు ముఖాముఖి పోరులో దీటుగా ప్రచారం సాగించి ఫలితాలపై ఉత్సుకతను రేకెత్తించాయి. ముఖ్యంగా చివరి అంకం గా ప్రతిసారి జరిగే బాలట్ పేపర్ల కలెక్షన్ కార్యక్రమం పై అనేకమంది తమ విరక్తిని చాటుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఒక జాతి నిలబడాలన్నా, ఒక సంస్థ పరిఢవిల్లాలన్నా, ఒక నవ చైతన్యం సమకూడాలన్నా ఈఆధునిక సమాజం సామాన్యుడి చేతికి ఇచ్చిన పాశుపతాస్త్రం ఓటు. ఈ ఓటు అనే అస్త్రం చేతిలోఉన్నంతకాలం ఎంతటి నేతలైనా సామాన్యుడి ముందు మోకరిల్లవలసిందే! తాము చేపట్టబోయేకార్యక్రమాల చిట్టాను సవినయంగా విప్పవలసిందే  ! ఓటరు దేవుడి కటాక్షం ఒక మామూలుకార్యకర్తను నాయకుడిగా మలచవచ్చు, ఒక 'చాయ్ వాలా'ను దేశాధినేతగా కుర్చోబెట్టనూ వచ్చు.అంతటి ఆయుధం చేతిలో ఉన్నందు వల్లే ఎన్నికలు ఎప్పుడొచ్చినా అమాంతం రెక్కలు కట్టుకొనివచ్చి సామాన్యుడికి ఒంగి ఒంగి దణ్ణాలు పెట్టే  నాయకవరేణ్యులు కోకొల్లలు.   
 
ప్రతీ అద్భుత శక్తి తనతో పాటు బృహత్తర బాధ్యతలు కూడా మోసుకొస్తుంది. అలాగే ఈ ఓటు అనే ఆయుధం కూడా తనతో విచక్షణ అనే సమున్నత బాధ్యత సహితంగా సామాన్యుడి చేతికి వస్తుంది.కాబట్టి ఓటరు మహాశయులారా.. మీ ఓటు ఎంతో విలువైనది. అది ఒక సంస్థ దిశానిర్దేశాన్నిశాసించగల ఒక అపురూపమైన నాయకత్వాన్ని మన సంస్థకు అందిస్తుంది. అంతటి విలువైనఓటును సద్వినియోగం చేసుకోండి. మీ బాలట్ పత్రాలను దయచేసి ఎవ్వరికీ ఇవ్వకండి. ఎక్కడోపుట్టి ఎక్కడో పెరిగి మనమంతా ఈ దేశానికి వచ్చాం. మన ఓటును మనం సద్వినియోగంచేసుకోవడం ద్వారా తెలుగు జాతి కీర్తి పతాకను విదేశాల్లో సైతం సగర్వంగా రెప రెపలాడేలాచెయ్యగలం. 

మరో తెలుగు తేజం ఉవ్వెత్తున ఎగసేలా చెయ్యగలిగిన సత్తా ఇప్పుడు మనకురాబోతోంది. ఒక స్వచ్చమైన నాయకత్వాన్ని ఎవరైతే మనకు అందించగలరో అలాటి వారినే మనంఎన్నుకొందాం. అలాంటి వారు ఎవరనేది మనం నిర్ణయించుకొందాం. మన నిర్ణయంలో ఇతరులుజోక్యం చేసుకోకుండా చూద్దాం. మన మనసుకు నచ్చిన, మనకు సంపూర్ణంగా విశ్వాసమున్న వారినేఎన్నుకొందాం. మన సంస్కృతినీ, మన వారసత్వాన్ని సగర్వంగా మనం భావి తరాలకు అందిద్దాం.ప్రపంచ పటంలో తెలుగు జాతికి సాటి మరోటి లేదని చాటి చెబుదాం. ఎటువంటి బెదిరింపులకూ,ప్రలోభాలకు లొంగకుండా మన బాలట్ పేపర్ ను మనమే ఉపయోగిద్దాం. ఓటు మన హక్కు. ఆహక్కుకు సార్థకత కల్పిద్దాం. 
 
రండి ఈ మహా యఙం లో మనమూ పాలు పంచుకొందాం. భువన భవనపు  బావుటాలమై పైకి లేద్దాం!