Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అనామిక పోలికలతో వస్తున్న వైఫ్ ఆఫ్ రామ్

అనామిక పోలికలతో వస్తున్న వైఫ్ ఆఫ్ రామ్

మంచులక్ష్మి కొత్త సినిమా వైఫ్ ఆఫ్ రామ్. ఈ వీకెండ్ విడుదలకు సిద్ధమైంది ఈ సినిమా. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది మంచులక్ష్మి. సినిమా హిట్ అవుతుందని కాదు, ఇది తనకు అవార్డులు తెచ్చిపెడుతుందని భావిస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా కథ అటుఇటుగా తెలుగులో ఆమధ్య వచ్చిన అనామిక సినిమాను తలపిస్తుందని అంటున్నారు సినీజనాలు. 

నాలుగేళ్ల కిందట శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నయనతార లీడ్ రోల్ లో వచ్చింది అనామిక సినిమా. అంతకంటే ముందు బాలీవుడ్ లో వచ్చిన కహానీ సినిమాకు రీమేక్ ఇది. ఇందులో హీరోయిన్, తన భర్త కనిపించడం లేదని పోలీస్ కంప్లయింట్ ఇస్తుంది. పోలీసులు అది నమ్ముతారు. భర్త కోసం వెదుకుతుంటారు. ఫైనల్ గా భర్త కనిపిస్తాడు. ఇన్నాళ్లూ అతడి కోసం వెదికిన భార్యే అతడ్ని చంపేస్తుంది. ఈ స్టోరీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు దాదాపు ఇదే ఛాయల్లో వైఫ్ ఆఫ్ లక్ష్మి కథ ఉంటుందట.

ఈ సినిమాలో కూడా మంచులక్ష్మి తన భర్తను చంపేస్తుందట. కాకపోతే అనామిక సినిమాలో పోలీసుల ద్వారా భర్తను కనిబెట్టి చంపేస్తే, ఇందులో పోలీసుల సహాయంతో సాక్ష్యాల్ని తారుమారు చేస్తుందట మంచులక్ష్మి. ఈ మొత్తం ప్రక్రియలో ఆమె ఏం సాధించిందనేది సినిమా స్టోరీ అని తెలుస్తోంది. 

మైనర బాలికలపై అత్యాచారాలు, మహిళలపై లైంగిక వేధింపులను నిరసిస్తూ.. స్ట్రాంగ్ కంటెంట్ తో పవర్ ఫుల్ గా ఈ సినిమాను తెరకెక్కించారట. అందుకే ఈ మూవీ తనకు కచ్చితంగా అవార్డులు తెచ్చిపెడుతుందని ఆశిస్తోంది మంచులక్ష్మి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?