ఒక రోజు తేడాతో విడుదలవుతున్నాయి మహేష్-బన్నీ సినిమాలు. రెండింటికీ బజ్ బావుంది. అయితే పబ్లిసిటీ మెటీరియల్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం తేడా కొడుతోంది. ఇప్పటి వరకు బన్నీ మీడియా ముందుకు రాలేదు. ఓ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఓ గ్రూప్ ఇంటర్వూ లేదు. సోలో ఇంటర్వ్యూ లేదు. మీడియా ముచ్చట లేదు. అటు మహేష్, ఆ సినిమా డైరక్టర్ అనిల్ రావిపూడి చూస్తుంటే ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తూ దున్నేస్తున్నారు.
రకరకాల కాంబినేషన్లలో ఇంటర్వ్యూలు చేయించి వదులుతున్నారు. ఈ విషయంలో బన్నీ స్వంత డిజిటల్ టీమ్ మాత్రం ఘోరంగా విఫలమైనట్లు కనిపిస్తోంది. అస్సలు ప్రోపర్ ప్లానింగ్ నే వున్నట్లు కనిపించడం లేదు. 12న విడుదల అయితే తొమ్మిదిన కూడా సాయంత్రం వరకు బన్నీ ఇంకా రంగంలోకి దిగలేదు. నేషనల్ మీడియాను నిర్మాతల ఖర్చుతో రప్పించి, ఇంటర్వ్యూలు ఇచ్చి పంపించారు. వీటి వల్ల మన బిసి సెంటర్లలో ఏం ఉపయోగమో బన్నీకే తెలియాలి.
అల సినిమాకు మరో సమస్య ఏమిటంటే దర్శకుడు త్రివిక్రమ్ నే ఏ డెసిషన్ అయినా తీసుకోవాలి. మహేష్ దగ్గర ఆ సమస్య లేదు. ఓ టీమ్ అంటూ పెట్టారు. అదే అన్నీ ప్లాన్ చేస్తోంది. మహేష్ దాన్ని ఫాలో అయిపోతున్నాడు. బన్నీ సినిమాకు అటు విశాఖలో లేదా ఇటు దుబాయిలో మరో ఫంక్షన్ అనుకున్నారు. ఇప్పుడు అదీ లేదని తేలిపోయింది. విడుదలయిన తరువాత 17న విశాఖలో ఫంక్షన్ అని ఇప్పుడు వినిపిస్తోంది. కానీ మళ్లీ 12 తరువాత డెసిషన్ ఎలా వుంటుందో?
ఏమయినా అల సినిమాకు పాటల వల్ల వచ్చిన బజ్ తప్ప, సినిమా టీమ్ చేస్తున్న కృషి మాత్రం అంతంత మాత్రంగానే వుంది. ఇలా అయితే సినిమా విడుదల తరువాత మరీ కష్టం అవుతుంది. బన్నీ తనకు ఆర్మీ వుంది అని చెప్పుకోవడం తప్ప, అది పని చేస్తోందో లేదో చూసుకోవడం లేదు.