రకుల్ ప్రీత్ సింగ్ హవా ఇప్పుడు టాలీవుడ్ లో సాగుతోంది. అంతే కాదు, కోలీవుడ్ లో కూడా ఆమె ఇప్పడు టాప్ స్టార్ అయిపోయింది. గత మూడేళ్లుగా తెలుగులో ప్రతి ఏటా మూడు, నుంచి నాలుగు సినిమాలు చేస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ తో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేసిన రకుల్, ఇప్పుడు మహేష్ తో రెండో సినిమా చేయడానికి రెడీ అయపోతోంది.
వంశీ పైడిపల్లి డైరక్షన్ లో దిల్ రాజు నిర్మించే మహేష్ బాబు సినిమాకు కూడా రకుల్ నే తీసుకోవాలని నిర్ణయించినట్లు బోగట్టా. ఈ సినిమాకు రకుల్ కు కోటికి పైగానె ముట్టినట్లు తెలస్తోంది.
ఇదిలా వుంటే తమిళంలో కార్తీ పక్కన నటిస్తున్న రకుల్ కు తమిళ్ ఆఫర్లు బాగానే వస్తున్నాయట. అయితే రెండు కోట్ల రేంజ్ లో పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రకుల్ దగ్గర వున్న సదుపాయం ఏమిటంటే, విపరీతమైన వర్క్ హాలిక్.
అందువల్ల సులువుగా ఏడాదికి నాలుగు సినిమాలు చేసేస్తుంది. మిగిలిన హీరోయిన్లు అలా కాదు. పైగా తమిళ్ లో ఇప్పుడు సరైన హీరోయిన్ లు లేరు. అనుష్క, నయనతార, త్రిష ఇలా సీనియర్లే తప్ప, యంగ్ హీరోయిన్లు తక్కువైపోయారు.
అందువల్ల రకుల్ అడిగినంతా ఇచ్చి తీసుకోవాల్సిందే. తప్పదు.