కళ్యాణ్‌ ఏమయ్యాడు?

నితిన్‌ హీరోగా నటిస్తున్న ‘కొరియర్‌బాయ్‌ కళ్యాణ్‌’ చిత్రం ఏనాడో మొదలైంది. చాలా రోజుల క్రితం ఈ చిత్రం ట్రెయిలర్‌ కూడా రిలీజ్‌ చేశారు. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదలయ్యేది ఇంతవరకు ఖరారు కాలేదు.…

నితిన్‌ హీరోగా నటిస్తున్న ‘కొరియర్‌బాయ్‌ కళ్యాణ్‌’ చిత్రం ఏనాడో మొదలైంది. చాలా రోజుల క్రితం ఈ చిత్రం ట్రెయిలర్‌ కూడా రిలీజ్‌ చేశారు. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదలయ్యేది ఇంతవరకు ఖరారు కాలేదు. మొన్నీమధ్యే మొదలైన నితిన్‌ సినిమా ‘హార్ట్‌ ఎటాక్‌’ మాత్రం అప్పుడే విడుదలకి సిద్ధమైపోతోంది. 

వచ్చే సంక్రాంతికి ‘హార్ట్‌ ఎటాక్‌’ రిలీజ్‌ అవుతుందని దర్శక, నిర్మాత పూరి జగన్నాథ్‌ ప్రకటించాడు. ఏకధాటిగా ఈ చిత్రం షూటింగ్‌ విదేశాల్లో చేస్తున్నారు. నితిన్‌ కూడా తన ‘కొరియర్‌బాయ్‌’ సినిమా ఏమైందనేది చెప్పట్లేదు. ‘హార్ట్‌ ఎటాక్‌’పైనే ఫుల్‌ ఎఫర్ట్స్‌ పెడుతున్నాడు. మరి ఆ సినిమా డిలే అవడానికి కారణాలేమిటో? 

వరుసగా రెండు విజయాలు సాధించిన నితిన్‌ హ్యాట్రిక్‌ కోసం ఉరకలేస్తున్న టైమ్‌లో వస్తున్న హార్ట్‌ ఎటాక్‌ అతనికి హ్యాట్రిక్కే ఇస్తుందో లేక హార్ట్‌ బ్రేక్‌ చేస్తుందో? పూరి జగన్నాథ్‌ అయితే ఈ సినిమా కథ మీద చాలా నమ్మకంతో ఎన్నో సంవత్సరాల తర్వాత తిరిగి తనే నిర్మాతగా దీనిని తెరకెక్కిస్తున్నాడు.