పూర్తయి రిలీజ్‌కి రెడీగా ఉన్న సినిమాని ఎప్పుడు విడుదల చేసేదీ తేల్చకుండా, ఏదో ఒక డేట్ చెప్పి అందర్నీ మభ్యపెట్టడం దిల్ రాజుకి రివాజుగా మారింది. అతను చేసే పనుల వల్ల చిన్న చిత్రాల నిర్మాతలు తమ సినిమాలు వాయిదా వేసుకుని, తీరా దిల్ రాజు చెప్పిన టైమ్‌కి అతని సినిమా రాకపోయేసరికి ‘డేట్ మిస్ అయ్యామే’ అని బాధ పడుతున్నారు.
‘ఎవడు’ రిలీజ్ విషయంలో దిల్ రాజు మళ్లీ సేమ్ స్ట్రాటజీ పాటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 19న విడుదల చేస్తానంటూ ఇప్పటికీ దిల్ రాజు చెబుతున్నాడు. అయితే ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని ఆల్రెడీ ఫిక్స్ అయ్యారనే టాక్ బలంగా వినిపిస్తోంది. కానీ సంక్రాంతికి ఎవడు వస్తుందనేది దిల్ రాజు ప్రకటించట్లేదు.
డిసెంబర్ 19కే తన సినిమా వస్తుందని అతను తనని కలిసిన వారితో చెబుతున్నాడు. కానీ ఎవడు సంక్రాంతికి వస్తుందనే సంకేతాలు బయ్యర్లకి కూడా అందినట్టు వార్తలొస్తున్నాయి. ఇలా డేట్స్ చెప్పి గేమ్ ఆడడం వల్ల దిల్ రాజుకి వచ్చే బెనిఫిట్ ఏమిటో కానీ… తన చిత్రాలకి సరైన రిలీజ్ ప్లాన్ చేసుకోలేకపోవడం మాత్రం దిల్ రాజుకి అలవాటైపోయింది. అతని సినిమాలు తప్ప వేరే వాళ్లవి ఎవరివీ ఇతర చిత్రాలతో క్లాష్ అవడం లేదంటే అతని ప్లానింగ్ ఎలాగుందో అర్థమవుతోంది.