వాట్సప్ ను మించిన కమ్యూనికేషన్ సాధనం మరోటి లేకుండా పోయింది. కొద్ది నిమషాల్లో వేలు, లక్షల మందికి సమాచారం చేరిపోతోంది. మంగళవారం రాత్రి నుంచి వాట్సప్ ల్లో జై లవకుశ కథ తిరగడం ప్రారంభమైంది. అయితే ఈ కథ నిజమా కాదా అన్నది తెలియదు కానీ, పక్కాగా, అదే సినిమా కథ అన్నంతగా వుంది. పైగా ఈ కథ మినిట్ టు మినిట్ అన్నట్లుగా డిటైల్డ్ గా రాయడం విశేషం.
నిజానికి ఇప్పటి దాకా జై లవకుశ కథ తొలి సగం మాత్రం జనాలకు చాలా వరకు ఇలాగే తెలిసిపోయింది. ముగ్గురు అన్నదమ్ములు, విడిపోవడం, ఇద్దరు కలవడం, ఇంటర్వెల్ బ్యాంగ్ వేళకు మూడో పాత్ర ప్రవేశించడం అన్నది ఇప్పటికే జనాలకు చేరిపొయింది. అయితే ద్వీతీయార్థం ఏమిటన్నది మాత్రం ఇప్పటి దాకా బయటకురాలేదు.
తాజగా వాట్సప్ లో చలామణీ అవుతున్న కథలో ద్వితీయార్థం కథ కూడా వుంది. ఇప్పటిదాకా కథ విషాదాంతం అని తెలుసు. కానీ జై క్యారెక్టర్ మీద క్లయిమాక్స్ లో సింపతీ బిల్డ్ అవుతుందని ఈ కథ చెబుతోంది. ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఎమోషనల్ బాండింగ్ వుంటుందని దీని ద్వారా అర్థం అవుతోంది.
పైగా ట్రయిలర్లు, టీజర్లు, జై క్యారెక్టర్ సీరియస్ గా వుంటే ద్వితీయార్థం చాలా సీరియస్ గా వుంటుందేమో అన్న అనుమానం వుంది. కానీ ఈ కథ ప్రకారం అయితే సెకెండాఫ్ కూడా చాలా సరదాగా సాగే అవకాశం వుంది. అంతే కాదు తొలిసగంలో రాశీఖన్నా, మలి సగంలో నివేదా థామస్ కనిపిస్తారు. ద్వితీయార్థం అంతా రావణుడు అనే జై ఇంట్లోనే జరుగుతుందని అనుకోవాలి.
మొత్తానికి కథ నిజమో కాదో కానీ, మన జనాలు అల్లి, వాట్సప్ లో తిప్పుతున్న కథ మాత్రం కాస్త ఆసక్తికరంగానే వుంది. పైగా కోన వెంకట్ స్టయిల్ లోనే వుంది.