వంద కోట్ల ఊసులేదేంటి??

అత్తారింటికి దారేది వంద కోట్ల ఆశ‌ల‌న్నీ ఆవిర‌య్యాయా?  ఈ సినిమా ఎన‌భై కోట్ల ద‌గ్గరే ఆగిపోయిందా??  అవున‌నే అంటున్నాయి మార్కెట్ వ‌ర్గాలు. అత్తారింటికి దారేది ని తొలి వంద కోట్ల తెలుగు సినిమాగా నిల‌బెట్టాల‌న్న…

అత్తారింటికి దారేది వంద కోట్ల ఆశ‌ల‌న్నీ ఆవిర‌య్యాయా?  ఈ సినిమా ఎన‌భై కోట్ల ద‌గ్గరే ఆగిపోయిందా??  అవున‌నే అంటున్నాయి మార్కెట్ వ‌ర్గాలు. అత్తారింటికి దారేది ని తొలి వంద కోట్ల తెలుగు సినిమాగా నిల‌బెట్టాల‌న్న చిత్రబృందం ఆశ‌లు ఫ‌లించ‌లేదు. ఎన్ని ప్రయ‌త్నాలు చేసినా.. దానికి ఇర‌వై కోట్ల ముందే ఈ సినిమా ఆగిపోయింది. 

మాసినిమా డ‌భై.. ఎన‌భై.. తొంభై కోట్లు వ‌సూలు చేసింద‌ని చెప్పుకొన్నా అంత సీన్ లేద‌ని లెక్కల్లో తేలుతోంది. ఇప్పటి వ‌ర‌కూ ఈ సినిమా రూ.80 కోట్లు వ‌సూళ్లు సాధించింద‌ని స‌మాచార‌మ్‌. ఎన్ని జిమ్మిక్కులు చేసినా వంద కోట్లు చేరుకోవడం క‌ష్టమే. చాలా చోట్ల‌.. థియేట‌ర్ల రెంట్ కూడా ద‌క్కడం లేదు. దాంతో వంద రోజుల కోసం ఆడించే ప‌రిస్థితి కూడా లేదు. 

మ‌రోవైపు చిత్రబృందం కూడా కామ్ అయిపోయింది. వంద కోట్ల మాట అటు నుంచి కూడా వినిపించ‌డం లేదు. ఎలాగోలా తొంభై కోట్లకు చేర్చి, ప‌ది క‌లుపుకొని వంద అన్నా ఫ‌ర్లేదు. మ‌రీ ఇర‌వై క‌లుపుకోవ‌డ‌మే క‌ష్టంగా మారింది వాళ్లకు. అందుకే వంద కోట్ల ఊసు వాళ్లు కూడా తీయ‌డం లేదు. మొత్తానికి ప‌వ‌న్ ఫ్యాన్స్ కి ఇది నిరాశ క‌లిగించే విష‌య‌మే. మ‌రి వంద కోట్లు సాధించే తొలి తొలుగు సినిమా ఏద‌వుతుందో చూడాలి.