రంగస్థలంలో లచ్చిమి అంటే ఎవరో మనందరికీ తెలుసు. ఎంత సక్కగున్నావే అంటూ రామ్ చరణ్ ఓ పాటేసుకున్నాడు కూడా. కానీ ఇదే సినిమాలో రంగమ్మ, మంగమ్మ కూడా ఉన్నారట. వాళ్లెవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. త్వరలోనే “రంగమ్మా, మంగమ్మా..” అంటూ మరో సాంగేసుకోబోతున్నాడు రామ్ చరణ్.
ఎంత సక్కగున్నావే పాట ఇనిస్టెంట్ గా హిట్ అయింది. అయితే సినిమాలో ది బెస్ట్ సింగిల్ ఇది కాదంటోంది యూనిట్. “రంగమ్మా, మంగమ్మా..” అనే సాంగ్ అన్నింటికంటే పెద్ద హిట్ అవుతుందని నమ్మకంగా చెబుతోంది. కొందరు దీన్ని ఐటెంసాంగ్ అంటున్నారు. మరికొందరు మాత్రం కాదంటున్నారు. అయితే సినిమాలో హైలెట్ మాత్రం ఈ పాటే అని అంతా కామన్ గా ఒప్పుకుంటున్నారు.
త్వరలోనే సోషల్ మీడియాలో ఈ పాటను విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. వచ్చేనెల 30న థియేటర్లలోకి రానుంది.