సినిమా ప్రకటించిన ప్రతిసారి వెంకీకి ఇదొక సమస్యగా తయారైంది. అతడి సరసన హీరోయిన్ ను సెట్ చేయడం మేకర్స్ కు తలకుమించిన భారంగా మారుతోంది. తాజాగా వెంకీ మరో సినిమా స్టార్ట్ చేశాడు. నాగచైతన్య-వెంకీ హీరోలుగా వెంకీ మామ అనే సినిమా లాంఛ్ అయింది. ఇందులో చైతూ సరసన రకుల్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. వెంకీకి ఇంకా సెట్ కాలేదు.
ప్రస్తుతం ఎఫ్-2 అనే సినిమా చేస్తున్నాడు వెంకటేష్. ఇందులో అతడికి జోడీగా తమన్నాను తీసుకున్నారు. సో.. వెంటనే మరోసారి మిల్కీబ్యూటీని రిపీట్ చేయలేరు. సో.. ఇప్పుడు సురేష్ బాబుకు ఆప్షన్లు చాలా తక్కువగా ఉన్నాయి. అనుష్క సినిమాలు చేయడంలేదు. నయనతార చుక్కలు చూపిస్తోంది. అమలాపాల్ కండిషన్లు పెడుతోంది.
సెప్టెంబర్ నుంచి వెంకీ-చైతూ సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలనేది ప్లాన్. అంటే అటుఇటుగా 40 రోజుల పైనే టైమ్ ఉంది. ఈ నెలరోజుల్లో హీరోయిన్ సెట్ అయితే ఓకే. లేదంటే మళ్లీ తమన్నానే రిపీట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
మరోవైపు ఈ సినిమాలో వెంకీకి హీరోయిన్ తో పనిలేదంటున్నారు కొంతమంది జనాలు. కథ ప్రకారం, సినిమాలో వెంకటేష్ కు హీరోయిన్ తో పెద్దగా అవసరం ఉండదని, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మాత్రం హీరోయిన్ తో పని ఉంటుందని అంటున్నారు. త్వరలోనే వెంకీ హీరోయిన్ ఎవరనే విషయంపై ఓ క్లారిటీ రానుంది.